ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు .

 

 


తెనాలి (ప్రజా అమరావతి);


      తెనాలిలో ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 


తెనాలి మారిసుపేట లోని చెంచు రామానాయుడు హైస్కూల్ ప్రాంగణంలో సుందరీకరించిన మున్సిపల్ ముస్లిం ఎలిమెంటరీ స్కూల్ ను శుక్రవారం మంత్రి మనోహర్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ తెనాలిలో ఉర్దూ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సుమారు 70 వేల రూపాయల సొంత నిధులతో ఉర్దూ పాఠశాలను సుందరీకరించిన పాఠశాల ఉపాధ్యాయురాలు భట్టిప్రోలు మాధవి కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. 


మిగతా పాఠశాలల్లో కూడా డోనర్ల సహకారంతో సుందరీకరించాలని సూచించారు. ఈ ఉర్దూ పాఠశాలను మోడల్ స్కూల్ గా ప్రతి ఒక్కరూ అందంగా తీర్చిదిద్దాలన్నారు. 



అసంపూర్తిగా ఉన్న ఉర్దూ పాఠశాల అదనపు గదులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. 


ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు.  ప్రభుత్వం నుండి విద్యార్థులకు అందిస్తున్న పుస్తకాలు, బూట్లు, బ్యాగు, బెల్టు, యూనిఫామ్, అమ్మకు వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం గురించి వివరాలు తెలుసుకున్నారు.


తొలుత మంత్రి మనోహర్ కు ఎన్సిసి విద్యార్థులు ఘన స్వాగతంతో తోడ్కొని వచ్చారు.


ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ కాలేదా నసీం, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ జయంతి బాబు, ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భట్టిప్రోలు మాధవి, చెంచురామానాయుడు ప్రధానోపాధ్యాయుడు కరిముల్లా, ఎన్సిసి ఉపాధ్యాయులు వెంకట్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Comments