కోటబొమ్మాళి (ప్రజా అమరావతి);
*ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏడాదిలో అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
*
*గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నేత*
*గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు*
*పేద వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం*
*ఏడాది పాలన బాగుందంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు*
*ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు దేశం పార్టీ శ్రేణులు*
*గత వైకాపా ప్రభుత్వం విధానాలతో ఆర్ధిక వ్యవస్ధ అస్ధవ్యస్తం*
*ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తు.. ప్రభుత్వ పథకాలు అందాయ అంటూ ఆరా*
*వచ్చే నెలలో 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.....ప్రారంభం*
*ఈ నెలలోనే వితంతు పింఛన్లు అందజేస్తాం*
తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సంద ర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఆదివారం శ్రీకాకళం జిల్లా కోటబొమ్మాళి మండలం నారాయణవలస గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పధకాలు అందుతున్నాయా అంటూ ఆరా.. ఈ నెలలోనే వితంతు
పింఛన్లు అంజేయడం జరుగతుందని వివరించారు. ఏడాదిలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు వివరించిన మంత్రి వర్యులు, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
*ఏడాదిలో ఇచ్చిన మాటను అమలు చేశాం*
ఐదేళ్ల వైసీపీ పాలనలో వైఫల్యాలను ఒక్కొక్క టిగా తొలగిస్తూ మీరు మెచ్చే విధంగా పాలన చేస్తున్నామా? లేదా అంటూ స్థానికుల నుంచి గౌరవ మంత్రి వర్యులు మంత్రి సమాధానాలు రాబ ట్టారు. ప్రభుత్వపరంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదవర్గాల కోసం ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, ఇవికాక రాబోయే నెలరోజుల్లో మరిన్ని పథకాలు మీకు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి వర్యలుతో పాటు నేతలు తమ ఇళ్లకు వచ్చి ఆప్యాయంగా పలకరించడం సంతృప్తికరంగా ఉందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఏడాదిలో మార్పు చూపించారు. ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాం. పింఛన్ దగ్గర నుంచి తల్లికి వంద నం వరకు అంతా బాగుంది.. . బస్సులో కూడా ఉచిత ప్రయాణం అంటున్నారు.. ఇంతకంటే సంతోషం ఏమీ ఉంటుంది అంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో నేతలు ఉబ్బి తబ్బిబయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ నేత అని పేద వర్గాలను ఆదుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ ఏడాదిలో ప్రజలకు చేసిన మేలును ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనతో తొలి అడుగు పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
*గత వైకాపా ప్రభుత్వం విధానాలతో ఆర్ధిక వ్యవస్ధ అస్ధవ్యస్తం*
గత వైకాపా ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్ధ అస్ధవ్యస్తం అయిందని ఆరోపించారు. సుమారు
11 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఆర్ధిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి సమాంతరంగా తీసుకు వెలుతున్నామని వివనించారు. సమర్ధవంతమైన నాయకులు గౌరవ ముఖ్య మంత్రి నారాచంద్రబాబు నాయుడు కావడంలో వ్యవస్ధలన్నీ గాడితో పడుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. భావితరాల భవిష్యత్త్ కోసం నిరంతం శ్రమించే నాయకులు ముంఖ్య మంత్రి చంద్రబాబునాయుడు గారని అన్నారు. కార్యక్రమంలో పీఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ గారు,తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
addComments
Post a Comment