విజయవాడ (ప్రజా అమరావతి);
భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికుల, వారి కుటుంబాల సంక్షేమమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక, కర్మాగార, బాయిలర్స్ మరియు వైద్య బీమా సేవల శాఖామంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల సంక్షేమశాఖ కార్యాలయంలో కార్మిక సంక్షేమ బోర్డు సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి హజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల రక్షణకు కార్మిక శాఖ అనేక చర్యలు తీసకుంటుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికులు ఊచకోతకు గురయ్యారని, కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా రంగాల కార్మికుల సంక్షేమంకు పెద్దపీట వేశామన్నారు. అందులో భాగంగానే ప్రతి పట్టణంలో అడ్డాకూలీగా రోడ్లపై గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి రాకుండ వారి కోసం పక్కా భవనాలను నిర్మించాలని ప్రతిపాదనను బోర్డు సమావేశంలో తీసుకున్నామన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఇంటిగ్రేటేడ్ కార్మిక భవనాలను నిర్మించనున్నామని, క్రమంగా ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశానమన్నారు. అంతేకాకుండ కార్మకులు, వారి కుటుంబ సభ్యులు నైపుణ్యం పెంచే విధంగా వారికి నైపుణ్య శిక్షణ అందించనున్నామన్నారు. అలాగే ప్రతి ప్యాక్టరీలో ఒక సేఫ్టీ అధికారిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని, దీంతో ప్రమాదాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడతాయన్నారు. ఇందుకోసం యూనివర్సిటీలతో ఎంఓయు చేసుకున్నామని వివరించారు.
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని, పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారని, దీంతో మన రాష్ట్రంలో కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఏడాదికి 50 రోజుల కంటే ఎక్కువ పనిచేసేవారిని కార్మికులుగా గుర్తిస్తున్నామని, నరేగా కార్మికులను గుర్తించడంతో రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది కార్మికుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో సెస్స్ వసూళ్ల శాతం పెంచటం దృష్టి సారించనున్నామని, వారి రక్షణ కోసం సెస్స్ వసూళ్లపై దృష్టిసారించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులను కూడా పరిగణలోకి తీసుకురానున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ ఇతర కార్మికుల సంక్షేమ మండలి ఛైర్మన్ వలవల బాబ్జి మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను పున:రుద్ధరిస్తున్నామన్నారు. కార్మికులు సంక్షేమ ఫలాలు సంపూర్ణంగా అందుకునేలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆదేశాల మేరకు సెస్స్ కలెక్షన్లు పెరగడానికి కృషి చేస్తున్నామన్నారు. 2014-19 మధ్యలో కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అటుపై అధికారం చేపట్టిన ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అధ్యాయనం చేసి ఉత్తమమైన వాటిని మన రాష్ట్రంలో అమలు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు, అడిషినల్ సెక్రటరీ గంధం చంద్రుడు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జారీ చేసినవారు : సంచాలకులు, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
addComments
Post a Comment