విజయవాడ (ప్రజా అమరావతి);
*విజయవాడలోని ఏపీ పర్యాటక శాఖ కార్యాలయంలో జరిగిన మాస్టర్ కార్డు వర్క్ షాప్ లో కీలక నిర్ణయాలు*
*రాష్ట్ర పర్యాటక రంగానికి అద్భుతమైన ట్యాగ్‌లైన్, మంచి థీమ్ సిద్ధం చేసేలా ప్రణాళికలు.. సెప్టెంబర్ లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు*
*రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలు, మార్గదర్శకాలు, కార్డు హోల్డర్ల అభిరుచులు, ప్రపంచస్థాయి ఈవెంట్లను యాక్సెస్ చేయడానికి అవసరమైన అవకాశాలపై వర్క్ షాప్ లో కొనసాగిన చర్చ*
విజయవాడ:విభిన్న పర్యాటక ప్రక్రియల ద్వారా ఏపీకి వచ్చే పర్యాటకులకు అమూల్యమైన అనుభవాలు కల్పించడం, సాధారణ క్షణాలను అసాధారణ కథలుగా మలిచే సదుద్దేశంతో ప్రతి అమూల్యమైన అనుభవం జీవితకాలం నిలిచే జ్ఞాపకాలను సృష్టించడానికి విజయవాడ ఆటోనగర్ లోని ఏపీ పర్యాటక శాఖ కార్యాలయంలో మాస్టర్ కార్డు వర్క్‌షాప్ జరిగింది. మాస్టర్ కార్డు వర్క్ షాప్ ద్వారా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, మార్గదర్శకాలు, విభిన్న పర్యాటక ప్రక్రియల ద్వారా పర్యాటకులకు అమూల్యమైన అనుభవాలు అందించేందుకు అవసరమైన విధానాలు రూపొందించడం, కార్డు హోల్డర్ల అభిరుచులు, ప్రపంచస్థాయి ఈవెంట్లను యాక్సెస్ చేయడానికి అవసరమైన అంశాలపై కీలక చర్చలు జరిగాయి. భవిష్యత్ అంతా టూరిజందే అని పేర్కొని అందుకు తీసుకోవాల్సిన చర్యలను సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి కందుల దుర్గేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ లు నిర్దేశించిన నేపథ్యంలో ఆ దిశగా పర్యాటక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్ర పర్యాటక రంగానికి అద్భుతమైన ట్యాగ్‌లైన్, మంచి థీమ్ సిద్ధం చేసే అంశంపై చర్చించింది.. త్వరలోనే సంబంధిత ట్యాగ్ లైన్ సిద్ధం చేసి సెప్టెంబర్ లో జరిగే ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని మాస్టర్ కార్డు వర్క్ షాప్ లో అధికారులు ప్రతిపాదించారు. అదే విధంగా సాంస్కృతిక, ఇతర మంత్రిత్వ శాఖ అధికారులతో సంబంధాలను సులభతరం చేయడం, ప్రభుత్వ యాజమాన్యంలోని ఛానెల్‌లలో సోషల్ మీడియా ప్రమోషన్‌కు మద్దతు కల్పించడం, పర్యాటకులు లీనమయ్యే అనుభవాలను రూపొందించడంలో సహకారం పొందడం, వారసత్వ ప్రదేశాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం, భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాస్టర్ కార్డ్ హోల్డర్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పర్యాటకులకు అమూల్యమైన జ్ఞాపకాలను కల్పించడం, వారితో కలిసి పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నామని చెప్పడమే లక్ష్యంగా వర్క్ షాప్ జరిగిందని ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఏపీ పర్యాటక రంగం వేగంగా వృద్ధి చెందుతుందని, త్వరలోనే దక్షిణాసియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక విడిది కేంద్రంగా, ప్రధాన గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ పర్యాటక ఖ్యాతిని,సాంస్కృతిక, వారసత్వ సంపదను ప్రపంచానికి చాటాలన్న సదుద్దేశంతో మాస్టర్ కార్డు వర్క్ షాప్ జరిగిందని అధికారులు తెలిపారు.
విభిన్న పర్యాటక అనుభవాల ద్వారా ఏపీకి వచ్చే పర్యాటకులకు మరుపురాని అనుభవాలు ఇవ్వడమే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాంతాలను నాలుగు సర్క్యూట్ లను విభజించి సర్క్యూట్ లను పర్యాటక శాఖ రూపొందించింది. అందులో భాగంగా అరకు, వైజాగ్ రీజియన్ ద్వారా గిరిజన సంస్కృతిని పరిచయం చేయడం, గిరిజనులతో మమేకం అయ్యేలా, స్థానికంగా తయారయ్యే వస్తువులను పర్యాటకులు స్వయంగా వీక్షించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఉభయ గోదావరి సర్క్యూట్ ద్వారా గోదావరి బ్యాక్ వాటర్ అందాలు, కొబ్బరి చెట్ల మధ్య, బోటులో ప్రయాణ అనుభవాల కల్పన, సూర్యలంక, చీరాల సర్క్యూట్ ద్వారా తీర ప్రాంత జీవనం, మత్స్యకారుల జీవనశైలి, చేనేత వారసత్వ అనుభూతులను కల్పించాలని నిర్ణయించారు. తిరుపతి సర్క్యూట్ ద్వారా అధ్యాత్మిక అనుభవాలు, నేతన్నల జీవనశైలి, ప్రకృతి సహజ సిద్ధ ప్రాంతాల్లో గడపడం ద్వారా కలిగే అనుభూతులను పర్యాటకులకు కల్పించనున్నారు.సరైన మార్కెటింగ్ ప్రణాళిక, అన్ని బ్రాండింగ్ అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని, ఈ నేపథ్యంలో తమ భాగస్వామం అవసరమని మాస్టర్ కార్డు హోల్డర్లను అధికారులు కోరారు.ఈ సందర్భంగా వర్క్ షాప్ లో పాల్గొన్న అందరికీ ఎండీ ఆమ్రపాలి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వర్క్ షాప్ లో పాల్గొన్న మాస్టర్ కార్డు హోల్డర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వర్క్ షాపు ద్వారా ఏపీ పర్యాటక శాఖ కల్పించిన అవగాహన, అందించిన అతిథ్యం, తమతో గడిపిన సమయానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. తమ మద్దతు, పూర్తి భాగస్వామ్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
వర్క్ షాప్ లో పర్యాటక శాఖ అధికారులు, మాస్టర్ కార్డు హోల్డర్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment