* శాప్ ఛైర్మన్ కు క్రీడాశాఖామంత్రి సూచన
* క్రీడల అభివృద్ధిని కాంక్షిస్తూ పలువురు మంత్రులకు విజ్ఞప్తి చేసిన శాప్ ఛైర్మన్ రవినాయుడు
వెలగపూడి: (ప్రజా అమరావతి);
ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించాలని క్రీడాశాఖామంత్రి ఎమ్.రాంప్రసాద్ రెడ్డి శాప్ ఛైర్మన్ రవినాయుడుని గురువారం ఆదేశించారు. ఏపీ సెక్రటేరియట్ లో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిని గురువారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో చేపట్టిన క్రీడాభివృద్ధిని, విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్పోర్ట్ డేను ఘనంగా నిర్వహించాలని సూచించారు. అలాగే క్రీడల అభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు.
*మంత్రులను కలిసిన శాప్ ఛైర్మన్..*
శాప్ ఛైర్మన్ రవినాయుడు గారు ఈరోజు ఏపీ సెక్రటేరియట్ లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి, క్రీడా సదుపాయాల కల్పన, ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్, ట్రైబల్ స్పోర్ట్స్ హాస్టల్ ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిధులను సమకూర్చి గిరిజన క్రీడాకారులకు మెరుగైన క్రీడాసదుపాయాలను కల్పించాలని మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారిని శాప్ ఛైర్మన్ రవినాయుడు గారు ఈరోజు ఏపీ సెక్రటేరియట్ లోని వారి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఎస్సీ కాంపౌండ్ కింద సబ్ ప్లాన్ నిధులను వినియోగించి క్రీడామైదానాల అభివృద్ధి, క్రీడా సదుపాయాల కల్పన, కేవీకేల ఏర్పాటుకు సహకరించాలని శాప్ ఛైర్మన్ గారు విన్నవించడం జరిగింది. అలాగే ఏపీలో పారా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (నేషనల్ డిజైబిలిటీ స్పోర్ట్స్ సెంటర్) ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం జరిగింది. దీనిపై మంత్రి గారు మాట్లాడుతూ ఏపీలో క్రీడల అభివృద్ధికి సమన్వయంతో పనిచేద్దామని సూచించడం జరిగింది.
బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎస్.సవిత గారిని శాప్ ఛైర్మన్ రవినాయుడు గారు ఈరోజు ఏపీ సెక్రటేరియట్ లోని వారి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడా సదుపాయాల కల్పనకు, క్రీడా పాలసీ అమలుకు కృషి చేయాలని శాప్ ఛైర్మన్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో క్రమంగా క్రీడలను ఆడించాలని విజ్ఞప్తి చేశారు. క్రీడా రాయితీలు, క్రీడా ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు బీసీ వెల్ఫేర్ నిధులతో వెనుకబడిన తరగతుల యువకులను, విద్యార్థులను క్రీడాపరంగా ప్రోత్సహించి వారికి మెరుగైన క్రీడాసదుపాయాలను నెలకోల్పేందుకు కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం జరిగింది.
addComments
Post a Comment