కౌలు రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు కు చర్యలు తీసుకుంటాము.

 గుంటూరు, 04 జులై 2025 (ప్రజా అమరావతి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని రాష్ట్ర శాసనసభ చీప్ విప్ ఆంజనేయులు తెలిపారు.


శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఉమ్మడి గుంటూరు  జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా అధ్యక్షతన జరిగింది. సమావేశంలో శాసనసభ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు,  నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, శాసన మండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, మర్రి రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాదు,  శాసనసభ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, దూళిపాళ్ళ నరేంద్ర, జూలకంటి బ్రహ్మరెడ్డి, నక్కా ఆనంద బాబు, బాష్యం ప్రవీణ్, జీడీసీఎంఎస్ చైర్మన్ మక్కెన మల్లిఖార్జనరావు , డీసీఎంఎస్ ఛైర్మన్ వడ్రాణం  హరిబాబు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  సమావేశంలో జలవనరుల శాఖ, వ్యవసాయం , అనుబంధ శాఖలు, వైద్యారోగ్యశాఖ తదితర ఏజెండా అంశాలపై జరిగిన చర్చ సంధర్భంగా రాష్ట్ర శాసనసభ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ పంటలకు సాగు నీరు అందించే ఎత్తిపోతల పధకాల నిర్వహణపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి అవరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నందున నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు, పురుగు మందులు అమ్మకాలు లేకుండా వ్యవసాయ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  బహుళార్ధకసార్ధక ప్రాజెక్టు అయిన బసకచర్ల ప్రాజెక్టు నిర్మాణం వలన భూములు కోల్పోతున్న ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదని మెరుగైన పునరావాస పథకం అందించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సంవత్సర కాలంలోనే పెన్షన్ పెంపుదల, సంవత్సరానికి ఉచితంగా మూడు సిలెండర్లు, కుటుంబంలోని పిల్లలందరికీ తల్లికి వందనం పథకాలను అమలు చేయటం జరుగుతుందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి జూలై నెలఖరులో మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వ వాటాను రైతులకు జమ చేయటం జరుగుతుందన్నారు.  అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్టు కారణంగా మిరప ధరల్లో  ఇబ్బందులు ఉన్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 


ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళి  మిర్చి రైతులకు ఉత్తమ ధర అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. అమరావతి మండలంలో డ్వాక్రా సంఘం నిధుల దుర్వినియోగం  పాల్పడిన వారిపై విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.


నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ దేవరాయులు మాట్లాడుతూ వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కేంద్రప్రభుత్వ పధకాలతో అనుసంధానం చేసి నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎత్తిపోతల పథకాలు సక్రమంగా నిర్వహణ కు సంబంధించి ఇరిగేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై  ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలన్నారు. భూసార పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు పీపీపీ విధానంలో మినీ భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్పాటుకు మినీ భూసారా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పీఎం కిసాన్ నిధులు రూ.6000, రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000 మొత్తం రూ.20,000 మూడు విడతల్లో అందించటం జరుగుతుందని, మొదటి విడత  జులై  నెలఖరులో  అందిస్తారన్నారు.  పల్నాడు జిల్లా పరిధిలో 90 చెరువుల అధునీకరణకు ఆర్ఆర్ఆర్ స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సహకార శాఖ కమిటీల ద్వారా ఎరువులు, పురుగుమందులు పంపిణీకి చర్యలు  తీసుకుంటామన్నారు. రైతులు తక్కువ పెట్టుబడితో అత్యధిక ఆదాయం అందించే పంటలు సాగు చేసేలా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న వైద్యులు పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇతర రాష్ట్రాలలో సైతం వైద్యసేవలు ఉచితంగా పోందే వీలున్న అయిష్మాన్ భారత్ పథకంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని అయిష్మాన్ భారత్ పథకంలో వైద్యశాఖ అధికారలు నమోదు చేయాలన్నారు. పెదకూరపాడు మండలంలో గారాపాడు చెరువు పూడ్చివేసి అక్రమించటం పై, గారాపాడు పంచాయితీలో నిధుల దుర్వినియోగం పై  జిల్లా పంచాయితీ అధికారి విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. 

జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ కౌలు రైతులందరికీ  బ్యాంకులు ద్వారా రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నల్లబర్లి పొగాకు కొనుగోలు అవరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయిష్మాన్ భారత్ కార్డులు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పంపిణీ జరిగేలా వైద్యారోగ్యశాఖ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. 

శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాదు మాట్లాడుతూ కౌలు రైతులందరికీ బ్యాంకులు పంటరుణాలు అందించాలన్నారు.

శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయులు కృషి ఫలితంగా వరికపూడిశెలకు అటవీఅనుమతులు సైతం వచ్చాయని, ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కల్తీ విత్తనాలు విక్రయాలు అరికట్టెందుకు వ్యవసాయశాఖ అధికారు నిరంతర పర్యవేక్షణతో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. 

శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ పంటలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పధకాలకు మరమ్మత్తులకు ప్రభుత్వం  ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిధులు మంజూరు చేస్తే నిర్వహణలో ఇబ్బందులు ఉండవన్నారు. మిరప, పత్తి పంటలలో గులాబి తెగులు నివారణకు వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపారులకు ఉన్న అర్డర్లు మేరకు రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని అనాధికార లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయితీ అధికారికి స్పష్టమైన ఆదేశాలు అందించామన్నారు


మాచర్ల శాసన సభ్యులు బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలికంగా రైతులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఐడీసీ స్కీంలో పంటలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు అధికలాభాలు వచ్చేలా స్థానిక వాతావరణ, భూసారానికి అనుగుణంగా తక్కువ ఖర్చుతో పంటలు సాగు చేసే విధానం పై రైతులకు ప్రత్యక్ష అవగాహన కోసం  ప్రతి మండలంలో వ్యవసాయశాఖ అధికారులు పంట క్షేత్రాలను సాగు చేయాలన్నారు.  గుండె, హార్ట్ స్ట్రోక్ వచ్చిన వారికి అత్యవసర పరిస్థితులలో అందించే ఇంజక్షన్లు, వెంటిలేటర్లు, ప్రాధమిక, కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు.  

కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాదును నాల్గవ స్టాయి సంఘం సభ్యునిగా ఎంపిక చేస్తూ సమావేశంలో ఎకగ్రీవంగా తీర్మానించారు. అదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల్లో అమోదించిన పనులకు సమావేశంలో ఏకగ్రీవంగా అమోదించారు.

  సమావేశంలో బాపట్ల డిఆర్ఓ గంగాధర్ గౌడ్ , జిల్లా పరిషత్ సీఈఓ  జ్యోతిబసు, సిపిఓ శేషశ్రీ , జిల్లా ఉపాధి కల్పనాధికారి దుర్గాబాయి , పీడీ డీఆర్డీఎ విజయలక్ష్మీ, జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వర రావు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. శ్రావణ్ బాబు , ఏడి మైనింగ్ చంద్రశేఖర్ ,  జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఉమ్మడి గుంటూరు జిల్లాల  అధికారులు పాల్గొన్నారు. 

Comments