రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఘనంగా స్వాగతం.


మచిలీపట్నం జూలై 24 (ప్రజా అమరావతి):

గురువారం ఉదయం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 57వ నాతకోత్సవంలో పాల్గొనేందుకు గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ  భారత్ ట్రస్ట్ కు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఘనంగా స్వాగతం

లభించింది. 

తొలుత గవర్నర్ ట్రస్ట్ కు చేరుకోగానే పోలీసు గౌరవ వందనం స్వీకరించాక జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు,  కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్,  విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆర్. శారద జయలక్ష్మి దేవి ఘనంగా స్వాగతం పలికి మొక్కలను అందజేశారు. 

స్నాతకోత్సవం ముగిశాక గవర్నర్,  ట్రస్టులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం సందర్శించి అక్కడి అబ్దుల్ కలాం విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 
అనంతరం శిక్షణ కేంద్రంలోని ప్లంబింగ్ శానిటరీ ప్రయోగశాల, విద్యుదీకరణ ప్రయోగ శాల, సౌరశక్తి శిక్షణ కేంద్రం, కారు మెకానిక్ శిక్షణ కేంద్రాలను పరిశీలించి అక్కడి శిక్షణార్థులతో కాసేపు  ముఖాముఖి మాట్లాడి వారితో కలిసి ఫోటోలు దిగారు. 

ఈ సందర్భంగా శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ట్రస్ట్ కార్యకలాపాలను గవర్నర్కు వివరిస్తూ  స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడతోపాటు హైదరాబాదు, నెల్లూరులో చాప్టర్లు ఉన్నాయన్నారు. శిక్షణా కేంద్రంలో గ్రామీణ మహిళలకు యువతకు, రైతులకు  40 రకాలకు  పైగా అంశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 95 వేల మందికి  శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ వెంట లేడీ గవర్నర్ సమీరా అబ్దుల్ నజీర్, గవర్నర్ కార్యదర్శి హరిజవహర్లాల్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు కైకలూరు  శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, ఎడిసి అమన్దీప్ సింగ్,, అదనపు ఎస్పీ సత్యనారాయణ, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, డిఎస్పి శ్రీనివాసరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments