ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.
*ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం


ములుగు (ప్రజా అమరావతి): ములుగు నియోజ‌క‌వ‌ర్గంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం  భారీగా నిధులు మంజూరు చేసింది. దేవాలయాల అభివృద్ధి కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేసింది. మంత్రి సీతక్క విజ్ఞప్తితో నిధులు మంజూరయ్యాయి. సీజీఎఫ్ నిధుల నుంచి రూ.1.42 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గోవింద‌రావు పేట మండ‌లం బుస్సాపూర్ జానకి రామాల‌యానికి రూ.12 ల‌క్ష‌లు, కొత్త‌గూడ మండ‌లం గుంజేడులోని ముస‌ల‌మ్మ ఆల‌యానికి రూ. 50 ల‌క్ష‌లు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ములుగు మండ‌లం జ‌గ్గ‌న్న‌పేట పుట్టా మ‌ల్లిఖార్జున స్వామి దేవాల‌యానికి రూ.30 ల‌క్ష‌లు, మ‌ల్లంప‌ల్లిలోని వెంక‌టేశ్వ‌రస్వామి దేవాల‌యానికి రూ.20 ల‌క్ష‌లు, ములుగు ప‌ట్ట‌ణంలోని నాగేశ్వ‌రస్వామి దేవాల‌యానికి రూ.20 ల‌క్ష‌లు, రామాల‌యానికి రూ.10 ల‌క్ష‌లు మంజూరు చేసింది. త్వ‌ర‌లో టెండ‌ర్లు పిలిచి ఆలయ అభివృద్ధి ప‌నులను నిర్వాహకులకు దేవదాయ శాఖ అధికారులు అప్ప‌గించ‌నున్నారు. నిధుల మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయ, ధ‌ర్మాదాయ శాఖ‌ మంత్రి కొండా సురేఖకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.
Comments