ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తుంది _ వైయస్ షర్మిల.

 

  అమరావతి (ప్రజా అమరావతి);


         అమరావతి రాజధాని నిర్మాణం కోసం 2015 అక్టోబర్ 22 న ప్రధాని నరేంద్ర మోడీ  శంకుస్థాపన చేసిన ప్రాంగణాన్ని సందర్శించడం జరిగింది. ఎటూ చూసినా పిచ్చి మొక్కలు, వెలుగు లేని విజన్ హౌజ్. ఇదే అక్కడ కనిపించిన అమరావతి రాజధాని. అనాడు శిలాఫలకం వేసి మట్టి,నీళ్లు కొట్టి వెళ్ళారు. శంకుస్థాపన చేసి 10 ఏళ్లు దాటింది. మళ్ళీ మొన్న మోడీ  వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. సేమ్ సీట్ రిపీట్ చేశారు. మోడీ  మాటలు వినటానికి, చూడటానికి అసహ్యంగా ఉంది. మోడీ  మాటలు నమ్మి చంద్రబాబు రాత్రి పడ్డ గోతిలో పగలు మళ్ళీ పడ్డారు. 


2015 లో 33 వేల ఎకరాల భూములు సేకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ  భూమి ఉంది అన్నారు. మొత్తంగా 54 వేల ఎకరాల్లో రాజధాని కడతాం అన్నారు. సింగపూర్, జపాన్, జర్మనీ అని చెప్పారు. రాజధాని బెస్ట్ లెవెబుల్ సిటీ అన్నారు. 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే పిచ్చి మొక్కలు తప్పా ఏ సిటీ లేదు. 29 వేల మంది రైతులు త్యాగాలు చేసి భూములు ఇచ్చారు. వారి త్యాగం ఇంత వరకు ఫలించలేదు. భూమి లేని కుటుంబాలు దాదాపు 23 వేల మందికి ఇంకా న్యాయం జరగలేదు. ఇప్పటికి రాజధాని పేరుతో ఆంధ్రా ప్రజలను భ్రమలో పెడుతున్నారు.


రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత. కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్. రాజధానికి అప్పులు చేయాల్సిన పని లేదు. రాజధాని కోసం బ్యాంకుల దగ్గర అప్పులు చేస్తున్నారు. 30 వేల కోట్లు ఇప్పటికే అప్పులు తెచ్చారు. మరో 40 వేల కోట్లు  అప్పులు చేస్తారట. ఈ అప్పులు ఎందుకు ? చంద్రబాబు గారు సమాధానం చెప్పండి. ఆంధ్రా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలంతో కేంద్రంలో ప్రభుత్వం నిలబడి ఉంది. మీ బలాన్ని ఉపయోగించి రాజధాని సాధించలేరా ?  మోడీ కాలర్ పట్టుకొని రాజధాని కి నిధులు తీసుకు రండి. మోడీ  కాలర్ పట్టుకొని నిలదీయండి. లక్ష కోట్లు అయినా కేంద్రం నుంచి తేవాలి.


ముందు సేకరించిన 33 వేల ఎకరాల్లో రాజధాని కట్టండి. ఆది పక్కన పెట్టీ... కొత్తగా 40 వేల ఎకరాలు ఎందుకు ? బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టేందుకు భూములు సేకరిస్తున్నారా ? మలి విడత భూముల సేకరణపై పెద్ద కుట్ర ఉంది. తొలి విడత రాజధాని కోసం..మలి విడత భూములు అమ్మాలని చూస్తున్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తుంది. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఇప్పటికీ సంతోషంగా లేరు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. వారి త్యాగానికి ప్రతిఫలం అందలేదు. చంద్రబాబు 


మీరు రియల్ ఎస్టేట్ మాఫియా ను బంద్ చేయండి. రాజధాని మీద దృష్టి పెట్టండి.

Comments