*మంత్రి నారా లోకేష్‌కు వచ్చిన నోటు పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ*
*చిలువూరులోని ఉర్దూ స్కూలు, బ్యాంకు స్కూలులో పంపిణీ చేయించిన మంత్రి నారా లోకేష్*
*మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు*
దుగ్గిరాల (ప్రజా అమరావతి): మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలవడానికి వచ్చిన వారు తీసుకువచ్చిన నోట్ పుస్తకాలను మంగళవారం చిలువూరు గ్రామంలోని ఉర్దూ స్కూలు, బ్యాంకు స్కూలులో విద్యార్థులకు స్థానిక నాయకుల ద్వారా పంపిణీ చేయించారు. మంత్రి నారా లోకేష్‌కు వచ్చిన నోట్ పుస్తకాలను పంపిణీ చేయడం పట్ల విద్యార్థులు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ షేక్ జబీనా మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యార్థులకు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదని అన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచిస్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాణిక్యమ్మ, ఎంపీటీసీ రోజ మరియమ్మ,నాయకులు శేషగిరి, కృష్ణప్రసాద్, యేసుపాదం, జానీ బాషా, సలావుద్దీన్, అరాఫత్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment