గుడివాడ ఆటోమొబైల్ రంగ ఖ్యాతిని మరింత పెంపొందిస్తాను:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.

 *గుడివాడ ఆటోమొబైల్ రంగ ఖ్యాతిని మరింత పెంపొందిస్తాను:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*



*ట్రాన్స్ పోర్ట్ వాహనదారుల ఏ.టి.ఎస్ సమస్య.. పరిష్కారానికి ఎమ్మెల్యే రాము కృషి*


*వేలాది మంది వాహనదారుల సమస్యలను... ఏపీ ట్రాన్స పోర్ట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే*


*ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపిన జేఏసీ నాయకులు...*


గుడివాడ జులై 22. (ప్రజా అమరావతి): దశాబ్దాల చరిత్ర కలిగిన గుడివాడ ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ ఆటోమొబైల్ రంగా ఖ్యాతిని ఎట్టి పరిస్థితిలో తగ్గనివ్వనని ఆయన స్పష్టం చేశారు. 


A.T.S విధానం వల్ల గుడివాడలోని వేలాది వాహనా దారులకు కలిగే ఇబ్బందులు మరియు నష్టాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.... జేఏసీ నాయకులతో కలిసి ఏపీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా దృష్టికి మంగళవారం సాయంత్రం తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులతో కలిసి విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే రాము వినతి పత్రాన్ని కమిషనర్ కు అందజేశారు.


అనంతరం ఎమ్మెల్యే రాముకు  గుడివాడ ట్రాన్స్పోర్ట్ వాహన దారుల జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడారు.... ఏ.టి.ఎస్ సెంటర్ ను జిల్లాకు ఒక మూలగా ఏర్పాటు చేయడం వల్ల కలిగే నష్టాలను  కమిషనర్ కు వివరించామన్నారు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్న కమిషనర్ సిన్హా కానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. 60 ఏళ్లుగా గుడివాడ ఆర్టీవో కార్యాలయం వాహనదారులకు సేవలు అందిస్తుందని, ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ తర్వాత అంత పెద్ద ఆటోమొబైల్ రంగం గుడివాడలో ఉండడం విశేషం అని ఆయన అన్నారు. 


ప్రస్తుతం ఏటిఎస్ సెంటర్ ను జిల్లాకు ఒక మూలగ పెట్టడం వల్ల వేలాది మంది వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఆయన చెప్పారు. ఆటో , ట్రాక్టర్, టాక్సీ లాంటి వాహనాలు బ్రేక్ చేయించుకోవడానికి 90 కిలోమీటర్ల దూరం వెళ్లడం వల్ల కలుగుతున్న వ్యయ ప్రయాసలను అధికారులకు వివరించామన్నారు. తాను ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదని, జిల్లాలోని అత్యధిక మంది వాహనదారులకు కలిగే ప్రయోజనాలకు ప్రాధాన్యత నిస్తున్నట్లు ఎమ్మెల్యే రాము అన్నారు. అధికారులు కూడా స్పందించి జిల్లాలోని అత్యధిక మంది వాహనదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. 


చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా వాహనదారుల సమస్యలను గుర్తించి స్పందించిన ఎమ్మెల్యే రాముకు గుడివాడ ట్రాన్స్ పోర్ట్ వాహనదారుల జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. తాము ఎన్ని పోరాటాలు చేసిన, అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోయామని, ఎమ్మెల్యే రాము చొరవతో సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి చెరువ కావడం సంతోషకరమని జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 


గుడివాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడుసుమిల్లి శ్రీనివాస్, జేఏసీ నాయకులు గుత్తా చంటి, గోళ్ళ శివ, R ప్రసాద్, ఆవుల రఘు, అడ్డాల నాని,మణికంఠ ,టాక్సీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెదబాబు, దుర్గారావు, వ్యాన్ స్టాండ్ ప్రెసిడెంట్ గోపాలరావు,మెరుగుమల రాము, y ప్రసాద్ మరియు రవాణా వాహన యజమానులు తదితర వాహనదారులు ఎమ్మెల్యే రాముతో కలిసి ట్రాన్స్ పోర్టు కమిషనర్ను కలిసిన వారిలో ఉన్నారు.

Comments