పేద వర్గాలను ఆదుకుంటున్న కూట‌మి ప్ర‌భుత్వం.

నిమ్మాడ (ప్రజా అమరావతి);

*పేద వర్గాలను ఆదుకుంటున్న కూట‌మి  ప్ర‌భుత్వం

*
 
*ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం*

*గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు*

*రాజకీయాలకు అతీ తంగా సీఎం సహాయనిధి ద్వారా పేద వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం*

*రూ.26,19,617 ల‌క్ష‌ల చెక్కుల‌ను 13 మంది ల‌బ్ధిదారుల‌కు  అందజేసిన మంత్రి*

 *చెక్కులు అందుకున్న  లబ్ధిదారులు గౌరవ మంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలిపారు*

రాజకీయాలకు అతీ తంగా ముఖ్య మంత్రి  సహాయనిధి ద్వారా పేద వర్గాలను కూట‌మి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని గౌర‌వ  రాష్ట్ర  వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు  అచ్చెన్నాయుడు గారు  అన్నారు. నిమ్మాడ  క్యాంప్  కార్యాల‌యంలో ఆదివారం వివిధ అనారోగ్య కారణంగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులకు
రూ. 26,19,617 ల‌క్ష‌ల చెక్కుల‌ను 13 మంది  ల‌బ్ధిదారుల‌కు  మంత్రి చేతుల మీదుగా అంద‌జేశారు.
పేద ప్ర‌జ‌ల అభ్యున్న‌తికి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు  నిరంత‌రం కృషిచేస్తున్నార‌ని అన్నారు.
 ఈ సంద‌ర్భంగా మంత్రి వ‌ర్యులు  మాట్లాడుతూ నియోజకవర్గం లో ఏ ఒక్కరు వైద్యం కోసం  ఆర్థిక ఇబ్బందులు పడకూడదని ఆశయంతో నా వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుంది అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వైద్యశాలలో లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించుకున్న లబ్ధిదారులు ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధి దారులు
వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబునాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన  మంత్రి వ‌ర్యుల‌కు  బాధితులు ప్రత్యేక కృ తజ్ఞతలు తెలిపారు
********


*చెక్కులు అందుకున్న లబ్ధిదారుల వివరాలు* 

వి.రాజారావు,  సాలిపేట , కోట‌బోమ్మాలి, రూ. 98,916, ఎస్‌.ధ‌ర్మారావు, పెంటూరు నందిగాం రూ. రూ.12,8027,
పి.చిన్నోడు,గోవింద‌పురం సంత‌బోమ్మాళి మండ‌లం,  స‌వ‌ర‌పేట‌,  రూ.5,42,716, బి.హ‌రితి  కోట‌బొమ్మాళి రూ, 69,200, కె. ల‌క్ష్మినారాయ‌ణ‌, ,సంత‌బోమ్మాళి రూ.68,500, టి. వెంక‌ట‌క‌ల్కి , రామేశ్వ‌రం టెక్కలి, రూ. 40,000, టి,ల‌క్ష్మ‌ణ‌రావు, తిలారు,రూ 48,734, బి.హాసిని, కోట‌బొమ్మాళి, రూ.6,17,173,కె,అర్జున  రావు కోట‌మ్మాళి మండలం చీపుర్ల‌పాడు,
బి.రామారావు,  నందిగాం మండ‌లం నౌగాం, రూ. 25, 000, ఎం.ఢిల్ల‌మ్మ ల‌క్కివ‌ల‌స‌, రూ. 47,388,  ఎస్‌.బాల‌రాజు, నందిగాం మండ‌లం జ‌ల్ల‌ప‌ల్లి, రూ.6,09,301,రోహిణి, మ‌రువాడ సంత‌బొమ్మిళి మండ‌లం, 2,0000, చెక్కులు అందుకున్నారు.
Comments