జోగులాంబ టెంపుల్‌ను స‌మ‌గ్రంగా అభివృద్ధి చేయాలి.
జోగులాంబ టెంపుల్‌ను స‌మ‌గ్రంగా అభివృద్ధి చేయాలి


రూ. 382.5 కోట్ల‌తో ఆల‌యం స‌మూల‌ అభివృద్ధి

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశం

జోగులాంబ మాస్ట‌ర్ ప్లాన్ పై ఎండోమెంటు ఉన్న‌తాధికారులతో స‌మీక్షా స‌మావేశం

హైద‌రాబాద్ (ప్రజా అమరావతి );

అలంపూర్ జోగులాంబ టెంపుల్‌ను స‌మ‌గ్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బుధ‌వారం డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ తెలంగాణ స‌చివాల‌యంలో జోగులాంబ ఆల‌య మాస్ట‌ర్ ప్లాన్ పై ఎండోమెంటు ఉన్న‌తాధికారులతో మంత్రి సురేఖ, స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్య‌క్షులు చిన్నారెడ్డి, ఎండోమెంటు డిపార్టుమెంటు ప్రిన్స్ ప‌ల్ సెక్ర‌ట‌రీ శైల‌జా రామ‌య్య‌ర్‌, క‌మిష‌న‌ర్ వెంక‌ట‌రావు, తెలంగాణ ధార్మిక్ అడ్వ‌జ‌ర్ గోవింద హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ... జోగులాంబ ఆలయాల అభివృద్ధి విషయంలో త‌మ ప్రభుత్వం ఎక్క‌డా రాజీ ప‌డ‌ద‌ని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల అభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టు వివ‌రించారు. కృష్ణ - తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో జోగులాంబ శక్తి పీఠం ఉంద‌ని... ఈ టెంపుల్ ప్ర‌గ‌తికి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. రానున్న రోజుల్లో భక్తులు, సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలోనే వ‌చ్చినా... ఆ మేర‌కు నిర్మాణ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ టెంపుల్‌ను మూడు విడ‌త‌ల్లో అభివృద్ధి చేస్తున్నామ‌ని, మొత్తం రూ. 382.5 కోట్ల‌తో అభివృద్ధి చేప‌డుతున్న‌ట్టు వివ‌రించారు.
Comments