గంబూసియాచేపలతోదోమలకుచెక్: మున్సిపల్ చైర్ పర్సన్ తాడిబోయినరాధిక రమేష్.

 *గంబూసియాచేపలతోదోమలకుచెక్:                              మున్సిపల్ చైర్ పర్సన్ తాడిబోయినరాధిక రమేష్




    తెనాలి జూలై 29 (ప్రజా అమరావతి ):                                                    


       తెనాలి పట్టణముస్థానిక        చినరావూరులోని సత్యనారాయణ పార్కు నందు మలేరియా మరియు ఫైలేరియా శాఖలవారి సహకారంతో మునిసిపల్ కమిషనర్ వల్లూరు.మహాలక్ష్మీపతిరావు , మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మువ్వాఏసుబాబుగారితో కలిసి పార్కులోని చెరువులో.                        గంబూసియా చేపలను మున్సిపల్ చైర్ పర్సన్ తాడిబోయిన రాధికరమేష్  విడుదల చేశారు.ఈ సందర్భంగా తాడి బోయినరాధికరమేష్  మాట్లాడుతూ నిల్వనీటిలో దోమలు గుడ్లు పెట్టడం ద్వారా అభివృద్ధి చెంది తద్వారా పెద్ద దోమలుగా తయారవుతాయని, ఈ దోమలు వివిధ రకాలైన వివిధ రకాల వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతాయని తెలిపారు. అటువంటి నిల్వనీటిలో ఈగంబూసియా విడుదల చేయడం వలన అవి దోమ లార్వాలను తినడం వలన పెద్ద దోమలఉత్పత్తి తగ్గిపోతుందని తద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. తెనాలి పట్టణంలో గల వివిధ నీటి కుంటలలో చెరువులలో ఈ గంబూసియా విడుదల చేయడమైనదని తెలియజేశారు. ప్రజలు నీటి నిలువలు లేకుండా చూసుకొనుట కాలువలలో చెత్త చెదారము వేయకుండా చూసుకొనుట తడిచెత్త,పొడి చెత్త విడివిడిగా ఇంటికి వచ్చే మునిసిపల్ సిబ్బందికి ఇవ్వడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాక దోమల యొక్క ఉత్పత్తి తగ్గి వివిధ రకాల జ్వరాల వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం కలుగుతుందని 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు  తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మిపతిరావు  మాట్లాడుతూ ఎటువంటి రసాయనిక పదార్థాలు వినియోగించకుండా జైవిక విధానంలో గంబూసియా విడుదల చేయడం వలన దోమల ఉత్పత్తిని తగ్గించడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ చేపలు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు.                                               జీవిస్తాయనితెలిపారు. అనంతరము మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మువ్వ.యేసుబాబు మాట్లాడుతూ ఒక్క గంబూసియా చేప ఒక్క రోజుకి 180 నుంచి 300 దోమల లార్వాలను తింటుందని ఇవి ఆక్సిజన్ తక్కువగా ఉన్న నీటిలోనూ తక్కువ నీటి పరిమాణం ఉన్న నీటి కుంటలలోనూ అధిక ఉష్ణోగ్రత అనగా 42 డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత ఉన్న వాటర్ లోను ఇవి సునాయాసంగా జీవిస్తాయని, దోమల లార్వాలే ప్రధాన ఆహారంగా ఉండటం వలన పరోక్షంగా దోమల ఉత్పత్తిని తగ్గించడంలో ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాయనితెలిపారు. ఈ చేపలను తెనాలిలోని వివిధ నీటి నిల్వల ప్రాంతాలలో విడుదల చేయడమైనదని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణసబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్,గ్రామీణ సబ్ యూనిట్అధికారివంగల పున్నారెడ్డి,ఆరోగ్య విస్తరణాధికారిఅందెబాలచంద్రమౌళి ఎస్ హెచ్ఐ జి.రవికుమార్, మలేరియా సూపర్వైజర్స్ వారి సిబ్బంది, సానిటరీ సెక్రటరీలు తదితరులు  పాల్గొన్నారు.

Comments