గుంటూరు, 10 జూలై 2025 (ప్రజా అమరావతి);: తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు
సాధ్యమని రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
గురువారం తెనాలిలోని రావి సాంబయ్య పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ( మెగా పేరంట్స్, టీచర్స్ మీటింగ్ 2.0) లో రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, ఈగల్ విభాగం ఎస్పీ నరేష్ తో కలసి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జరిగిన సభలో రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విద్యార్ధుల తల్లిదండ్రులను, పూర్వ విద్యార్ధులను, దాతలను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించటానికి కష్టకాలంలో సైతం రూ. 36,000 కోట్లు ప్రభుత్వం కేటాయించటం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా అమ్మకు వందనం పధకాన్ని అమలు చేశారు. తెనాలి నియోజకవర్గంలో 23,200 మంది పిల్లలకు సుమారు రూ. 32 కోట్లు కేటయించటం జరిగిందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ డొక్కాసీతమ్మ స్పూర్తితో పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యహ్నా భోజనం పథకంకు ప్రతినెల రాష్ట్రంలోని 41,000 పాఠశాలలు, 4000 సంక్షేమ హాస్టల్స్ కు 25 కేజీల 57,57,000 సన్న బియ్యం బస్తాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ద్వారా సరఫరా చేయటం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్ధులు మంచిగా చదువుకోవాలన్నారు. తల్లిదండ్రులు తరుచు పాఠశాలకు వచ్చి పిల్లల విద్యాభోదన, పాఠశాల మౌలిక సదుపాయాలను పరిశీలించి అవసరమైన సూచనలు అందించాలన్నారు. షైనింగ్ స్టార్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని , దీనిలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ఉండేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. తెనాలి నియోజకవర్గంలో వైద్య, విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని , ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో మౌళిక సౌకర్యాలు కల్పించి మోడల్ గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించటం జరుగుతుందన్నారు. రావి సాంబయ్య పురపాలక పాఠశాలలోను 686 మంది విద్యార్ధులు ఉన్నారని, ఇక్కడ మౌలిక సౌకర్యాలు కల్పనకు దాదాపు రూ.35 లక్షల మేర నిధులు అవసరమని తెలిపారని , రానున్న సంవత్సరకాలంలో పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలో విద్యుత్ పరికరాల మరమ్మత్తుల కోసం రూ.5 లక్షల నిధులను మన్సిపల్ శాఖ ద్వారా వెంటనే మంజూరు చేయటం జరుగుతుందన్నారు. అదే విధంగా నెస్లీ కంపెనీ తెనాలి పరిధిలోని పది పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణానికి సీఎస్ఆర్ నిధులు అందిస్తుందని, ఇక్కడ పాఠశాలకు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తల్లిదండ్రలు విద్యార్ధులను చదువుతో పాటు, కళల్లోను, క్రీడల్లోను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెనాలిలో ఎందరో క్రీడల్లో, కళల్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు ఉన్నారన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాజకీయ ముసుగులో కొంతమంది యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయాలు పాల్పడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంగా సమాజానికి చేటు చేసే గంజాయి, డ్రగ్స్ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారిపై కఠినమైన సెక్షన్లు క్రింద కేసులు నమోదుతో పాటు , వారి ఆస్తులను జప్తు చేస్తున్నామన్నారు. యువత మత్తుపదార్ధలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోరాదని, తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా ఉన్న సమయంలో తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలతో రహదారులను అభివృద్ది చేయటం జరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా తెనాలిలో తడి, పొడి చెత్త వేరు చేసే డస్ట్ బిన్ విధానంను అమలు చేయటం జరిగిందన్నారు. విద్యార్ధులకు చదువుతో పాటు నైపుణ్యాలలో శిక్షణ అందించాలన్నారు. ఇటీవలే తెనాలి యువతకు , డ్వాక్రా మహిళలకు నైపుణ్యాభివృద్దికి భవనం, స్థలాలను దాతలు అందించారన్నారు. ఇదే స్పూర్తితో పాఠశాలలోని పూర్వ విద్యార్ధులు , దాతలు అభివృద్ది పనులకు సహకారం అందించాలన్నారు. సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి అందిస్తున్నామని, అమ్మకు వందనం పథకం సాంకేతిక కారణాలతో నగదు జమ కానీ వారికి వాటిని సరి చేసి అందించటం జరుగుతుందన్నారు. పాఠశాల అభివృద్ధి విధ్యార్ధుల తల్లిదండ్రులు, అధికారులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ విద్యార్ధుల చదువుతో పాటు ఇతర అంశాల్లో ఉన్న ప్రావీణ్యంను తెలుసుకొని వారి అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వామ్యులను చేయలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పేరేంట్స్, టీచర్స్ మీటింగ్ 2.0) నిర్వహించటం జరుగుతుందన్నారు. జిల్లాలో 5047 పాఠశాలలు, 155 జూనియర్ కళాశాలలో మెగా పేరేంట్స్, టీచర్స్ మీటింగ్ 2.0 జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా ప్రతి విద్యార్ధికి హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డులు, హెల్త్ కార్డులు ఇచ్చి తల్లిదండ్రులకు వివరించటం జరుగుతుందన్నారు. పర్యావరణం పరిరక్షణ ప్రాధాన్యతను విధ్యార్ధులకు తెలియజెసి వారిని భాగస్వాములను చేయటానికి గ్రీన్ పాస్ పోర్టు కార్యక్రమం ద్వారా మొక్కలు పెంపకం చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో 49,000 వేల మంది గ్రీన్ పాస్ పోర్టు కార్యక్రమంలో నమోదు చేసుకోగా 79,000 మొక్కలు పంపిణీ చేయటం జరిగిందన్నారు. వీటిని మూడు సంవత్సరాల పాటు విద్యార్దులు పర్యవేక్షిస్తారని, గ్రీన్ పాస్ పోర్టు ద్వారా ఉపాధ్యాయులు పాయింట్లు కేటాయించటం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు డా. సర్వేపల్లి రాధ కృష్ణ విద్యా మిత్రా పథకం ద్వారా స్కూల్ యూనిఫాం, బెల్ట్, షూస్, టెక్ట్స్, నోట్ పుస్తకాలు అందిస్తున్నారన్నారు. డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంకు పౌరసరఫరాల శాఖ మంచి క్వాలిటీ సన్నబియ్యంను అందిస్తుందన్నారు. పాఠశాలకు వచ్చే కుటుంబాలకు ఆర్ధిక ఇబ్బందులు ఉండకూడదని తల్లికి వందనం ద్వారా కుటుంబంలో పాఠశాలకు వచ్చే ప్రతి పిల్లవాడికి రూ.15,000 ఇస్తుందని, ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 1,60,000 పిల్లలకు ఇవ్వటం జరిగిందని , మొదటి తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం వారికి అడ్మిషన్లు పూర్తి అయిన వెంటనే మంజూరు చేయటం జరుగుతుందన్నారు. సాంకేతిక ఇబ్బందులతో నగదు జమలు ఆగిన తల్లిదండ్రులు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వాటిని సరిచేసి అందించటం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో డ్రాపౌట్స్ శాతం తగ్గించటానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. పిల్లల భవిష్యత్తుకు అందరూ కలిసి పనిచేయాలన్నారు.
ఈగల్ విభాగం ఎస్పీ నగేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని వీలైనంత త్వరగా గంజాయి రహితంగా తీసుకురావటానికి ఎన్ఫోర్స్మ్టేంట్ తో పాటు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సింగిల్ విండో ఇన్ఫర్మేషన్ గా ఒక టోల్ ఫ్రీ నెం 1972ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మీరు మాదకద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం ఈ నెంబరు కు తెలియజేయవచ్చు అని , అలాగే డ్రగ్స్ కు అడిక్ట్ అయిన వారిని రిహాబిలిటేషన్ సెంటర్స్ లో చేర్చించాలన్నా 1972 టోల్ ఫ్రీ నెంబరులో సంప్రదించవచ్చన్నారు. రాష్ట్రాన్ని అతి త్వరగా డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీసుకొని రావటానికి మీ సహకారం అందించాలన్నారు. స్కూలులోనలుగురు బాలురు , నలుగురు బాలికలు, ఇద్దరు టీచర్లతో డ్రగ్స్ ఫ్రీ స్కూలుగా తీసుకువస్తామన్నారు. అలాగే స్కూలుకు 100 మీటర్ల పరిధిలో టుబాకోకు సంబంధించిన సిగరెట్స్. గుట్కా తదితర కొనుగోళ్ళు ఉండకూడదన్నారు. ఇది చాలా తీవ్రమైన సమస్య, చదువుకున్నవారకి విచక్షణ జ్ఞానం ఉంటుందని, కాని వారే డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారన్నారు. మిమ్మలను ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా చుట్టుపక్కల వారని కూడ డ్రగ్స్ తీసుకోకుండా చూడల్సిన బాధ్యత ఉందన్నారు.
సమావేశంలో డ్రగ్స్, గంజాయి పై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత పాఠశాలలో మొక్కలు నాటారు.
సమావేశం అనంతరం రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, ఈగల్ విభాగం ఎస్పీ నరేష్ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో కలసి మధ్యహ్న భోజనం చేశారు.
సమావేశంలో తెనాలి మున్సిపల్ ఛైర్పర్సన్ తాడిబోయిన రాధిక , మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ పతి జిల్లా విద్యాశాఖ అధికారిణి రేణుకా, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, తహశీల్దార్ గోపాల క్రిష్ణ , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి , కౌన్సిలర్ మాలేపాటి హరి ప్రసాద్ , విద్యార్దులు , తల్లి తండ్రులు , పూర్వ విద్యార్దులు పాల్గొన్నారు.
addComments
Post a Comment