తాడేపల్లి (ప్రజా అమరావతి);
వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి.
ఒక్క వైయస్సార్‌సీపీ మాత్రమే
:
– రాష్ట్రంలో ఇటీవల చంద్రబాబు కుట్రల నేపథ్యం. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న వైఖరి. పొలిటికల్ గవర్నెన్స్ నడిపిస్తున్న తీరు.. ఇవన్నీ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రాజ్యాంగం ఉనికి, చట్టం కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.
– ప్రజలకు ఏ కష్టం వచ్చినా, పలుకుతోంది వైయస్సార్‌సీపీ మాత్రమే. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. రైతులు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. చివరకు ఉద్యోగులకు కష్టం వచ్చినా కూడా వైయస్సార్‌సీపీనే ప్రశ్నిస్తోంది.
– ఇంకా అధికారం కోసం చంద్రబాబు ఇచ్చిన అడ్డగోలు హామీలు. మోసం చేసిన విధానం. వాటిని ఆ మోసాలు ఎండగడుతూ ప్రశ్నిస్తున్న పార్టీ కూడా ఒక్క వైయస్సార్‌సీపీ మాత్రమే.
– ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు, ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలు సమీకరించడం, ప్రజలకు సంఘీభావంగా వారితో గొంతు కలపడం, వారికి తోడుగా నిలబడడం ధర్మం కూడా ప్రతిపక్షానిదే.
అందుకే వరసగా కార్యక్రమాలు:
– ఏడాది నుంచి చంద్రబాబు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అందుకే రైతులకు గిట్టుబాటు ధర కోసం, వారికి పెట్టుబడి సాయం అందకపోవడం, ఉచిత పంటల బీమాను ఎత్తివేసిన పరస్థితి, లేని ఇన్‌పుట్ సబ్సిడీ అన్నింటిపై 2024, డిసెంబరు 13న వైయస్సార్‌సీపీ రాష్ట్రంలో ధర్నా కార్యక్రమం చేశాం.
– కరెంటు ఛార్జీల బాదుడుపై గత డిసెంబరు 24న రాష్ట్రంలో నిరసన కార్యక్రమం. ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకు పైగా బాదుడుపై నిరసన కార్యక్రమం. పోరుబాట నిర్వహించాం.
– పిల్లల చదువులతో చంద్రబాబు చెలగాటం. విద్యాదీవెన, వసతిదీవెన ఎగ్గొట్టిన వైనం. వాటన్నింటిపై మార్చి 12, యువతపోరు నిర్వహించాం. నిరుద్యోగ భృతి గురించి కూడా ప్రశ్నించాం.
– జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు మోసాలు వివరిస్తూ, వెన్నుపోటు దినం నిర్వహించాం. చంద్రబాబుగారు ఎగ్గొట్టిన బాకీలు అడిగాం. ఆరోజు రాష్ట్రమంతా కార్యక్రమం.
– ఇప్పుడు కూడా బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ అన్న నినాదంతో, ‘రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’ పేరుతో చంద్రబాబు మోసాలు ఎత్తి చూపుతూ, ప్రజలను చైతన్యులను చేస్తూ.. నాడు చంద్రబాబు ఇచ్చిన బాండ్లు టీడీపీ నాయకులకు చూపిస్తూ, ప్రభుత్వం పడిన బకాయిలు అడుగుతూ రాష్ట్రమంతా కార్యక్రమం కొనసాగుతోంది.
– జూలై (ఈనెల) 21 నుంచి గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామంలో అందరినీ చైతన్యులను చేసే దిశగా కార్యక్రమం నిర్వహిస్తాం.
తట్టుకోలేక వేధింపుల పర్వం:
– చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ఆయన ఏదీ చేయడని చెప్పి, వైయస్సార్‌సీపీ తలుపు తడుతున్నారు. ఎందుకంటే, వచ్చేది మన ప్రభుత్వమే అని అందరికీ తెలుసు.
– దీన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. మా హయాంలో పోలీసులు అత్యుత్తమ పోలీసులుగా, పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండే వారు. స్పందన కార్యక్రమంలో మా పార్టీ వారి కంటే ఎక్కువగా టీడీపీ వారి సమస్యలు పరిష్కరించేవారు.
– అదే ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటంటే.. చంద్రబాబుగారి మాట ఏ పోలీసు అధికారి అయినా వినకపోతే.. డీజీ స్థాయి అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు.
ఇంకా మరో డీజీపీ స్థాయ అధికారి సునీల్‌కుమార్, మరో అధికారులు సంజయ్, కాంతిలాల్‌రాణ టాటా, విశాల్‌గున్నీ.. అందరిపై తప్పుడు కేసులు వేధింపులు.
– బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతి రాణా టాటా తదితరులను తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు.
– వీరు కాక నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, మూడు అడిషినల్ కమాండెంట్‌లు, రెండు అసిస్టెంట్ కమాండెంట్‌లను కూడా హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు.
– 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్‌స్పెక్టర్లు, వందల మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు.
– చంద్రబాబు మాట వినని పోలీసుల పరిస్థితి. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తోందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే పెట్టుకుని వారిని అవినీతిలో భాగస్వాములను చేసుకుంటున్నారు.
కొందరు అధికారుల అధికార దుర్వినియోగం:
– ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే డీఐజీలు కేంద్రంగా కొందరు అధికారులు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
– కొన్ని చోట్ల కొందరు ఆ జోన్‌కి మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కింద సీఐలు, ఒక డీఎస్పీ ఆయన ఆర్మీ.
– నియోజకవర్గంలో జరిగే ఇసుక, మద్యం బెల్టు షాపులు, వాటికిచ్చే పర్మిషన్, పేకాట క్లబ్బులు, నడిచే పరిశ్రమల నుంచి డీఐజీల ఆధ్వర్యంలో సీఐలు కప్పం వసూలు చేసి రివర్స్‌లో ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. సగం వీళ్లు తీసుకుని మరోసగం చినబాబు, పెదబాబుకి పంపుతారు.
– ఇవన్నీ తట్టుకోలేక సిద్దార్థ కౌశల్ వంటి యంగస్టర్, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. కేంద్రానికి వెళ్లడానికి ఎన్వోసీ ఇవ్వకపోవడంతో చంద్రబాబుతో పడలేక రాజీనామా చేసి వెళ్లిపోయాడు. – ఏ ప్రభుత్వంలో అయినా పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉంటే, నేరస్తులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతారు. కానీ ఇక్కడ మాత్రం మంచి పోలీసులు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోతున్నారు.
యథేచ్ఛగా దాడుల పర్వం:
– కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్. బీసీ. నా సోదరి హారిక. టీడీపీ సైకోలు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అసలు ఆమె చేసిన తప్పేమిటి? ఎందుకు ఆమె మీద దాడి చేశారు? ఎందుకు దుర్భాషలాడారు?
– చంద్రబాబు చేసిన మోసాలు నిలదీయడం తప్పా? రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’ కార్యక్రమానికి ఆమె వెళ్తుంటే దాడి చేశారు. సా.5 గం.కు దాడి మొదలై, 6.30 వరకు కొనసాగింది. ఆమెను, ఆమె భర్తను కారులో ఉంచి తిడుతూ, కొడుతూ, కారు అద్దాలు ««ధ్వంసం చేశారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగినా, వారు ప్రేక్షకపాత్ర పోషించారు.
– చంద్రబాబుని అడుగుతున్నా..
ఆమె బీసీ మహిళ. ఆమెను తిడుతూ, అనరాని మాటలు అనాల్సిన అవసరం ఏముంది? దారి కాచి దాడి చేయడం సబబేనా? ఇది శాడిజమ్ కాకపోతే మరేమిటి?.
నిస్సిగ్గుగా ఎదురుదాడి:
– ఇంత హేయమైన దాడి చేసి, సిగ్గు లేకుండా దుర్భాషలాడి, ఒక బీసీ మహిళ, నా చెల్లి హారికను టీడీపీ వారు మహానటి అంటున్నారు. కనీసం సిగ్గుందా? అన్నీ చేసిన మీరు ఆమెను మహానటి అంటారా?
(అంటూ.. ఆ వీడియో ప్రదర్శించి చూపారు. హారికపై టీడీపీ మూకల దాడి దృశ్యాలు).
– పోలీసులు దగ్గరుండి, వారి సమక్షంలో జడ్పీ ఛైర్మన్‌పై దాడి. మహిళ. ఆమెను మహానటి అని రివర్స్ విమర్శ చేస్తున్నారు. అసలు ఎవరు మహానటులు. దాన వీర శూర కర్ణ కన్నా గొప్ప నటన ఆయన చేస్తున్నాడు.
– ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు. ఇంత స్పష్టంగా ఘటన జరిగితే, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కారణం ఆ దాడి చేయించింది వారే కాబట్టి. పై నుంచి ఫోన్లు చేసి మరీ ఈ దాడి చేయించారు.
– ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. కళ్ల ముందు కనిపిస్తున్న వీడియో పక్కనపెట్టి, హారిక భర్త రాముపై కేసు పెట్టారు. ఆయన తన కారుతో ఢీ కొట్టాడని.
– అది గవర్నమెంట్ కారు. నడిపేది గవర్నమెంట్ డ్రైవర్. ఆ కారులో రాము వెనక సీట్లో కూర్చున్నాడు. ఆయన ఢీ కొట్టాడని కేసు పెట్టారు.
వారు బీసీల గురించి మాట్లాడడం సిగ్గుచేటు.
– ఆ మర్నాడు పెడనలో సమావేశం నిర్వహిస్తే.. పేర్ని నాని, జోగి రమేష్ తదితరులపై కేసు పెట్టారు. పార్టీ ఒక క్యాడర్ మీటింగ్ పెట్టుకోకూడదా?
అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?
– పోలీసులు రక్షణ కల్పించడం లేదు సరికదా? వారి సమక్షంలోనే దాడులు జరుగుతున్నా, బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా?
చంద్రబాబు ప్రతి పనిలోనూ టాపిక్ డైవర్షన్:
– నా ప్రతి పర్యటనలో ఆయన చేస్తోంది అదే. దాడులు చేసే ప్రయత్నం. తప్పుడు కేసులు పెట్టించడం. ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చియార్డుకు వెళ్లాను. గత ఏడాది మిర్చి క్వింటా ధర రూ.27 వేలు పలికితే, చంద్రబాబు ప్రభుత్వంలో అది రూ.8 వేలకు పడిపోయింది. ఆ రైతులకు తోడుగా, వారికి మద్దతు ఇస్తూ, మిర్చియార్డుకు పోయింది జగన్ మాత్రమే. అది తప్పేనా?
– ఆరోజు నా పర్యటనకు నా సెక్యూరిటీ తగ్గించాడు. ఆయనకు మూడ్ వస్తే ఇస్తాడు. లేకపోతే జడ్ ప్లస్ కేటగిరీ తీసేస్తాడు. మళ్లీ మాపైనే కేసు పెట్టారు.
– ఆ తర్వాత ఏప్రిల్‌లో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో పర్యటన. మా పార్టీ బీసీ నాయకుడు కురుబ లింగయ్యను దారుణంగా హత్య చేస్తే పరామర్శకు వెళ్లాను. సెక్యూరిటీ ఇవ్వలేదు. దీంతో జనం పోటెత్తి, హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతింది. అక్కడా పైలట్లను వేధించారు. మాపైనా కేసులు పెట్టారు.
– జూన్ 12. పొదిలిలో పర్యటన. పొగాకు ధర దారుణంగా పడిపోయింది. మరోవైపు కొనేవారు లేరు. రైతులు తల్లడిల్లుతుంటే, వారికి సంఘీభావంగా నేను పర్యటించాను. 40 వేలకుపైగా తరలి వచ్చారు.
– అప్పుడు ఒక 40 మందిని సిద్ధం చేసి దాడులకు వ్యూహరచన చేశారు. వారికి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు. అయినా రైతులు సంయమనం పాటించారు. వారు ఎదురుదాడి చేయలేదు.
– అయినా 3 కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైలుకు పంపారు. మేము రైతులకు అండగా నిలబడితే, నీకొచ్చిన కష్టం ఏమిటి?
చంద్రబాబు చేయాల్సింది చేయడు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులు. కేసులు. అరెస్టులు.
– జూన్ 18న, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటన. మా పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే నేను వెళ్తే అడ్డుకోవాలని ప్రయత్నం.
– నా కోసం ప్రజలు వస్తే, చంద్రబాబుకు ఏం ఇబ్బంది? ఆయన కార్యక్రమానికి జనం రాకపోతే, మాకేం సంబంధం? నా కార్యక్రమానికి రావొద్దని, మా పార్టీ నాయకులకు నోటీసులు. హౌజ్ అరెస్టులు.
– అలా నా కార్యక్రమానికి జనం రాకుండా కుట్ర. ఇంకా 5 కేసులు నమోదు.
ఆ సినిమాలే ఆపేయొచ్చు కదా?:
– సినిమా డైలాగ్‌లో పోస్టర్లుగా ప్రదర్శిస్తే.. ఇద్దరిని అరెస్టు చేశారు. నీకు ఆ డైలాగ్‌లు నచ్చకపోతే, సెన్సార్‌బోర్డుకు చెప్పి, వాటిని తీసేయించొచ్చు కదా?
– నిజానికి బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్ సినిమాల్లో డైలాగ్‌లు ఇంకా దారుణం. సినిమా డైలాగ్‌లు ప్రదర్శిస్తే, కేసులు పెట్టడం ఏమిటి? సినిమాలు ఆపేయండి.
– ఎవరో ఒకరు సినిమా డైలాగ్‌లు ప్రదర్శిస్తే, వారికొచ్చిన నష్టం ఏమిటి?
– 131 మందికి నోటీసులు. ఇద్దరిని రిమాండ్‌కు పంపారు. చంద్రబాబు ఎవరి పేరు చెబితే, వారిని పిలిపించడం రోజంతా కూర్చోబెట్టడం.. కేసులు పెట్టడం.
– ప్రతి ఛార్జ్‌షీట్‌లో ఓ ముగ్గురు, నలుగురి పేర్లు రాసి. అండ్ అదర్స్ అని రాస్తున్నారు. ఆ తర్వాత తమ టార్గెట్‌లో ఉన్న వారిని అందులో జోడిస్తున్నారు.
మామిడి రైతుల కష్టాలు. అక్కడా మాకు వేధింపులు:
– మామిడి రైతుల సమస్యలపై జూలై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లాను. మామిడి ధర దారుణంగా పతనం. మే రెండో వారంలో కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉన్నా, జూన్ చివరి వరకు పట్టించుకోలేదు. నెల రోజులకు పైగా ఆలస్యం చేశారు.
– టీడీపీకి సంబంధించిన వారి కంపెనీలు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేశాయి. ఇక్కడ కిలో మామిడి రూ.12 అంటున్నారు. కానీ, ఎంత మందికి ఆ ధర ఇచ్చారు.
– 6.5 లక్షల టన్నుల పంట. 2.5 లక్షల ఎకరాల్లో సాగు. 76 వేల మంది రైతులకు ఇక్కట్లు. వారికి సంఘీభావంగా నేను అక్కడికి పోవడం తప్పా? ఆ కార్యక్రమంలో రైతులు పాల్గొనడం తప్పా?
– 2 వేల మందికి నోటీసులు. వందల మంది అరెస్టు, ముగ్గురు ఎస్పీలు. వందల మంది పోలీసులు. వారంతా నా సెక్యూరిటీ కోసం. ప్రజలు నా కార్యక్రమానికి రాకుండా చూడడం కోసం.
– చివరకు బైక్‌లకు పెట్రోల్ కూడా పోయొద్దని నోటీసులు ఇచ్చారు. ఇన్ని చేసినా వేలాది రైతులు తరలి వచ్చారు. మామిడిని రోడ్ల మీద వేసి, నిరసన వ్యక్తం చేసి, నన్ను కలిశారు. ఆ కార్యక్రమంపై 5 కేసులు పెట్టారు.
రైతులు, ప్రతిపక్షాన్ని పట్టుకుని అసాంఘిక శక్తులు, దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం.
అందుకు వారు సిగ్గుపడాలి:
– ఈనాడు చూస్తే దారుణ రాతలు. అది టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ. టిష్యూ పేపర్‌కు తక్కువ. నాపై రైతులు నిరసన వ్యక్తం చేశారని ఈనాడులో రాశారు. అది ఒక పేపరేనా? మామిడి రోడ్ల మీద వేసిన రైతులపైనా కేసులు పెట్టారు.
– ఇకపై రాష్ట్రంలో ఏ ఒక్కరూ సమస్యలు ప్రస్తావించొద్దని, వారు రొడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్కరికీ ఉండొద్దని, ఎన్నికలప్పుడు ఇచ్చిన 143 హామీలు అన్నీ నెరవేర్చామని ప్రజలంతా భావించాలంట. లేదని ఎవరైనా ప్రశ్నిస్తే, తప్పుడు కేసులు. వేధింపులు.
– పాలకుడు అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు.. పాత్రికేయం లని చెప్పుకోవడానికి ఎల్లో మీడియాకు సిగ్గుండాలి.
ఇది పైశాచికత్వం కాదా?:
– అనంత జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్మే పెద్దారెడ్డి.. తన సొంత ఇంటికి పోలేకపోతున్నారు. ఆయన ఎప్పుడు పోవాలని చూసినా, పోలీసులే అడ్డుకుంటున్నారు. ఏకంగా గన్ చూపిస్తున్నారు.
(అంటూ ఆ ఫోటో చూపారు).
– నెల్లూరు జిల్లాలో 6సార్లు ఎమ్మెల్యే అయిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై ఒక పథకం ప్రకారం, వీరి పచ్చ సైకోలు, పచ్చ శాడిస్టులు పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది,
– అప్పుడు ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో ఉండి ఉంటే, చంపేసి ఉండేవాళ్లు.
(అంటూ పోలీసుల సమక్షంలోనే దాడి దృశ్యాల ప్రదర్శన).
– అదృష్టవశాత్తూ ప్రసన్న ఇంట్లో లేడు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉండి ఉంటే.. దాడి చేసిన వారిపైన కానీ, చేయించిన ఎమ్మెల్యేపై కానీ ఏ చర్య లేదు. కేసు లేదు.
– కానీ, ప్రసన్నపైనే కేసులు నమోదు. అంటే ఇక్కడ బాధితుడే బాధ్యుడన్నట్లు చిత్రీకరణ. ఇది పైశాచికత్వం కాదా? ఒక దుష్ట సంప్రదాయం తీసుకొచ్చాడు చంద్రబాబు.
అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరెండి:
– ఒక్క కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు.. ప్రసన్న అన్న విషయమే కాదు.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు పెట్టారు.
– వీళ్లే కాక 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి.. లాంటి తమ జీవితంలో మచ్చ లేని రిటైర్డ్ అధికారులు వీరు.
–వీరు కాక ఇంకా ఎంతో మంది అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. అన్ని కేసులకు ఒకటే మోడస్ ఆపరాండి. తప్పుడు వాంగ్మూలంతో తమ టార్గెట్‌లో ఉన్న వారిపై కేసులు. అరెస్టులు.
అప్పుడు వారి పరిస్థితి ఏమిటి?:
– ఇదే సంప్రదాయాన్ని రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఇప్పుడు దెబ్బ తిన్న వారు ఇలాగే వ్యవహరిస్తే, మీ పరిస్థితి ఏమిటి?
– చంద్రబాబుగారు వేసిన విత్తనం రేపు వృక్షమై పోతుంది. రేపు ఇదే కొనసాగితే.. చంద్రబాబు, టీడీపీ వారి పరిస్థితి ఏమిటి? ఈరోజు దెబ్బ తిన్న వారు ఊర్కోరు కదా?
– ఈరోజు మీరు చేసే తప్పుడు సంప్రదాయం, రేపు విషవృక్షం అవుతుంది. ఈరోజు దెబ్బ తిన్నవారు, మేము చెప్పినా వినకపోవచ్చు.
కాబట్టి చంద్రబాబు ఇకనైనా పద్ధతి మార్చుకో. తప్పుడు సంప్రదాయం వదిలెయ్.
ఏదీ లేదు. అయినా ఎవరూ మాట్లాడొద్దు:
– ఇవన్నీ చంద్రబాబు ఎందుకు చేస్తున్నాడో అందరికీ తెలుసు.
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేదు. మ్యానిఫెస్టో హామీల అమలు లేదు. రైతు భరోసా లేదు. తల్లికి వందనం లేదు. వాటి గురించి ఎవరూ మాట్లాడొద్దు.
– గత ఏడాది ఒక సిలిండర్ కొందరికే ఇచ్చారు. ఈ ఏడాది కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. తల్లికి వందనం లేదు. నిరుద్యోగ భృతి ఏడాదికి రూ.36 వేలు. దీన్ని మొత్తం ఎగ్గొట్టారు.
– దీన్ని ఎవరూ ప్రశ్నించొద్దు. అడగొద్దు. 50 ఏళ్లకే పెన్షన్ అని దాన్ని ఎగ్గొట్టారు. ఫ్రీ బస్ లేదు. ఏడాది గడిచిపోయింది. పండగల మీద పండగల డేట్లు చెబుతున్నాడు. కానీ, అమలు మాత్రం లేదు.
– పిల్లలు చదువులు మాని, పనులకు పోతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటికి 6 క్వార్టర్లు పెండింగ్. అలా రూ.4,200 కోట్లు బకాయిలు.
– వసతి దీవెన కింద ఏటా ఏప్రిల్‌లో రూ.1100 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లు గడిచాయి కాబట్టి, రూ.2200 కోట్లు. రెండూ కలిపి రూ.6,600 కోట్లు కావాలి కానీ, ఇచ్చింది మాత్రం రూ.770 కోట్లు. అయినా ఎవరూ మాట్లాడొద్దు.
– ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.3600 కోట్లు చొప్పున బకాయి. ఆరోగశ్రీ, ఆరోగ్య ఆసరా కింద రూ.4500 కోట్లు బకాయి.
– చంద్రబాబు తొలగించిన ఉద్యోగాలు 3 లక్షలకు పైగా. 2.6 లక్షల మంది వాలంటీర్లు. ఎండీయూ వాహనాల ద్వారా 20 మంది ఉపాధి కోల్పోయారు.
– ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్. అధికారంలోకి వస్తే జీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ తెస్తామన్నారు. అదీ మోసం. ఉద్యోగుల బకాయిలు రూ.20 వేల కోట్లు దాటాయి. అడిగితే తోకలు కట్. అక్రమ కేసులు.
– చివరకు గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వీర్యం. ధాన్యం కొనుగోళ్ల బకాయిలు ఏప్రిల్ నుంచి దాదాపు రూ.1000 కోట్లు బకాయి.
అప్పుల కుప్ప. దా ‘రుణ’ స్థితి:
– చంద్రబాబు 14 నెలల్లోనే తెచ్చిన అప్పులు 1,75,112 కోట్లు. కానీ, ఒక్క పథకం అమలు లేదు. 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. అప్పుడు రెండేళ్లు కరోనా ఉంది. అయినా అన్ని పథకాలు ఇచ్చాం.
– అంటే మా 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో 52.34 శాతం 14 నెలల్లోనే చేశాడు. మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయింది? ఎవరికి మంచి చేయలేదు. పథకాల అమలు లేదు.
– అయినా ఎవరూ అడగొద్దు. రూ.18,272 కోట్ల బాదుడు విద్యుత్ ఛార్జీల రూపంలో భారం వేశారు. ఫ్యుయెల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ (ఎఫ్‌పీపీసీఏ) పేరుతో దోపిడి.
– చంద్రబాబు పుణ్యమా అని అమూల్ నష్టపోతోంది. మరోవైపు హెరిటేజ్ లాభాల్లో ఉంది. పాల ధరలు పెరిగాయి. పిల్లల ఫీజులు పెరిగాయి. నాడు–నేడు పనులు నిల్చిపోయాయి. అయినా ఎవరూ మాట్లాడొద్దు.
ఎవ్వరూ ప్రశ్నించొద్దు:
– కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అమ్మకం, మట్టి మాఫియా, ఇసుక స్కామ్.. దేని గురించి ఎవరూ మాట్లాడొద్దు.
– ఇక్కడ నిర్మాణ వ్యయం పెంచారు. ప్రతి అడుగుకు దాదాపు రూ.10 వేలు చెల్లింపు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి, 8 శాతం కమిషన్ తీసుకుంటున్నారు.
– ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇస్తున్నారు. అయినా ఎవరూ మాట్లాడొద్దు. ప్రశ్నించొద్దు. ఎక్కువ ధరకు పీపీఏ చేసుకున్నా అడగొద్దు.
ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగాయి. అయినా ఎవరూ ప్రశ్నించొద్దు.
వడ్డీతో సహా చెల్లిస్తాం:
– ఒకటే చెబుతున్నా. ప్రజలతో ఉంటాం. వారి కోసం పోరాడుతాం. కేసులకు భయపడం.
– చంద్రబాబుకు, ఆయనకు వత్తాసు పలుకుతున్న వారికి ఒకే హెచ్చరిక. ఎవరినీ వదలం. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. మరో మూడేళ్లు గడిస్తే, మా ప్రభుత్వం వస్తుంది.
మీడియా ప్రశ్నకు సమాధానంగా..:
ఇండోసోల్‌ను తరిమేసే కుట్ర:
ప్రకాశం జిల్లాలో ఇండోసోల్‌కు భూమి ఇచ్చాం. వారు రైతులకు డబ్బులిచ్చారు. 8 వేల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. కానీ, వారిని వెళ్లిపొమ్మంటున్నారు. ఆ భూములు వేరే వారికి ఇచ్చేలా, ఇండోసోల్ కంపెనీని కరేడుకు పొమ్మంటున్నారు. అక్కడ రైతులు రెండు పంటలు పండే భూములు ఇవ్వబోమంటున్నారు. ఆ కంపెనీ రూ.42 వేల కోట్లు పెట్టుబడి. మరి మీరు కంపెనీలు రావాలనుకుంటున్నారా?
అదే బీపీసీఎల్‌కు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే, ప్రకాశం జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని ఇవ్వొచ్చు కదా? వారికి ఇండోసోల్ కంపెనీ ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది?
అదే చంద్రబాబు లక్ష్యం:
– పరిశ్రమల ఏర్పాటు కాదు చంద్రబాబు లక్ష్యం. వారిని బెదిరించి సొమ్ము చేసుకోవడం. జిందాల్ వాళ్లు వెళ్లిపోయారు. అరబిందో వాళ్లు దండం పెడుతున్నారని శ్రీ వైయస్ జగన్ చెప్పారు.
addComments
Post a Comment