కష్టపడి పనిచేసిన లీగల్ సెల్ సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది-మాజీ మంత్రి శ్రీమతి విడదల రజిని .

కష్టపడి పనిచేసిన లీగల్ సెల్ సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది-మాజీ మంత్రి  శ్రీమతి విడదల రజిని .


 

    నరసరావుపేట  (ప్రజా అమరావతి);


     ఈరోజు నరసరావుపేట లో పల్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల సదస్సు జరిగింది .

ఈ సమావేశం లో మాజీ మంత్రి విడదల రజిని  మాట్లాడుతూ పార్టీ నాయకులు ,కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు అండగా ఉన్నారని ,

కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది అని తెలిపారు. 

వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యం గా మనం అందరం కలిసి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి,సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే లు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు ,వైసీపి నాయకులు సుధీర్ భార్గవ్ రెడ్డి మరియు పలువురు లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments