రాష్ట్ర అభివృద్ధికి దుష్టశక్తిలా జగన్ అడ్డుపడుతున్నాడు: నక్కా ఆనంద్ బాబు.

 



*రాష్ట్ర అభివృద్ధికి దుష్టశక్తిలా జగన్ అడ్డుపడుతున్నాడు: నక్కా ఆనంద్ బాబు


*


*ప్రజలు 11 సీట్లు ఇస్తే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా జగన్ కు చేతకావడం లేదు*

*అధికారంలో ఉన్నప్పుడు పబ్జీ ఆడుకున్నావ్... ఇప్పుడు కూడా పబ్జీ ఆడుకోవచ్చు కదా?*

*పరామర్శల పేరుతో ఎందుకు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నావు*

*రపా రపా నరికితే మంచిదే కదా సినిమా డైలాగ్ వాడితే తప్పేంటని మాట్లాడావు*

*మరీ వివేకం సినిమా ఎందుకు కోర్టుకువెళ్లి అడ్డుకున్నావు... రిలీజ్ చేయవచ్చు కదా?*

*బీసీ, ఎస్సీలను చిత్రహింసలకు గురిచేసి హత్యలు చేశావ్*

*హక్కులు అడిగిన వారిని హత్యలు చేసి హింసించావ్*

*ఐదేళ్ల పాలనలో పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని వేలమందిపై తప్పుడు కేసులు పెట్టించి వేధించావు*

*నీ ఆటలు ఇక సాగవు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు.*

*గవర్నర్ పేరు మీద అప్పులు చేసిన జగన్ కు అప్పుల గురించి మాట్లాడే హక్కే లేదు* 




అమరావతి (ప్రజా అమరావతి);


     ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల పాటు జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. అంతా చూస్తుంటే పాత సినిమాలో రాజనాల క్యారెక్టర్ గుర్తుకువస్తుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో హత్యలు, దౌర్జన్యాలు చేసి నేడు ఏం తెలియనట్టు ప్రెస్ మీట్ లో కూర్చుకున్నాడు. వైసీపీ కార్యాలయాన్ని స్టూడియోగా మార్చుకోవచ్చు. వైసీపీ అధికారంలో ఉన్నప్పు ప్రజా స్వామ్యంలో ఉన్నామా అనే ఆలోచన వచ్చేది. నిరంకుశత్వంగా పరిపాలన సాగించాడు. 11 సీట్లకే పరిమితం చేసినా ప్రజలు ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారన్న ఆలోచన కూడా జగన్ చేయడం లేదు. ఇంకా అదే దోరణిలో మాట్లాడుతున్నాడు. 11 సీట్లు ఇచ్చారు అయినా సిగ్గు రాలేదు కదయ్యా జగన్. అవసానదశలో ఉన్న పార్టీని బతికించుకోవాలనే ఆలోచనతో జగన్ మీడియా ముందుకు వస్తున్నారు. ప్రజలు నీకు ఆరోజే చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రజలకు నరకం చూపించావ్. మళ్లీ నువ్వు వచ్చే పరిస్థితులు లేవు. 


*పోలీస్ వ్యవస్థపై మాట్లాడే హక్కు జగన్ కు లేదు:*

పోలీసులపై మాట్లాడేందుకు సిగ్గు ఉండాలి. నేడు నిజాయతీగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంటే వారిపై విమర్శలు చేయడం సిగ్గులేని తనం. డీఐజీని పట్టుకొని మాఫియా డాన్ అంటావ్. గతంలో చీటికి మాటికి వచ్చే పోలీస్ సంఘాలు నేడు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి. మాజీ ఐపీఎస్ సిద్దార్థ కౌశల్ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే దాన్ని రాజకీయం చేస్తున్నావ్. నీ పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశావు అది అందరికి తెలుసు. సొంత పార్టీ ఎంపీని ఏ విధంగా కొట్టి హింసించావో అందరం చూశాం. నీ కక్ష సాధింపు చర్యల కోసమే ఐదేళ్ల పాటు పోలీస్ వ్యవస్థను వాడుకున్నావు. చెట్లు తొగలించడం, పరదాలు కట్టేందుకు, ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేసేందుకు పోలీస్ వ్యవస్థను వాడుకున్నావు. 25వ ర్యాంకు ఉన్న వ్యక్తికి కేవలం నీ సామాజికవర్గం అయినందుకు డీజీపీని చేసి అడ్డంగా దోపిడీలు చేశావు. నిన్ను నమ్ముకుంటే పోలీసులకు ఏం లభిచింది. రామాంజనేయులు జైలుకు పోయాడు. ఐపీఎస్ లను జైలుకు పంపించావ్. 40 రోజులు సినిమా యాక్టర్ ను హింసించి నానా ఇబ్బందులకు గురిచేస్తే నువ్వు ఏం చేశావు. వాళ్లని అందలం ఎక్కించే ప్రయత్నం చేశావు. యువగళం పాదయాత్ర చేస్తూంటే ఆంక్షలు పెట్టి కనీసం స్టూల్ పై కూడా నిల్చొని ప్రసంగం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వలేదు. అడ్డగోలుగా కేసులు పెట్టిన పనికిమాలిన ప్రభుత్వం నీది. నువ్వు పోలీసు వ్యవస్థను నేడు విమర్శలు చేస్తున్నావు. పోలీస్ వ్యవస్థను వాడుకోవడంలో నిన్ను మించిన వాడు ఎవడూ లేడు. 


*ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే నువ్వు:*

దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే పరామర్శకు వెళ్తున్న చంద్రబాబు గారి ఇంటి వద్ద గేట్లకు తాళ్లు కట్టి అడ్డుకుంది ఎవడు ఇదా ప్రజాస్వామ్యం అంటే. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకొని ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసింది నువ్వు. రపా రపా నకరమని చెబుతన్నావ్ అసలు సిగ్గు ఉందా. సినిమాలో డైలాగులు వాడితే తప్పింటని మాట్లాడుతున్నావు. సినిమాను సినిమాలా చూడాలి కానీ ఇలా నరికితే మంచిదేగా అంటావా సిగ్గు ఉందా. ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు సమాజానికి ఏం చెబుతున్నావు. మొన్న ప్రెస్ మీట్ లో రపారపా నరికితే తప్పేంటని అంటావ్. నేడు అదే మట్లాడుతున్నావు. 


*బీసీ, ఎస్సీల గురించి మాట్లాడే హక్కుందా నీకు:*

జగన్ ఐదేళ్ల పాలనలో బీసీలను బానిసలుగా, ఎస్సీలను అంటరాని వారిగా చూశాడు. బీసీ, ఎస్సీలపై దాడులు, హత్యలు చేయించావు. ఐదేళ్ల పాలనలో బీసీలు, ఎస్సీలకు నరకం చూపించారు. నీ ఇంట్లోకి రావాంలటే బీసీ, ఎస్సీలు చెప్పులు బయట వదిలి రావాల్సిన పరిస్థితి, నువ్వు బీసీలు, ఎస్సీల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. చిటికెస్తే చీకట్లో నరేకేయండని పేర్ని నాని మాట్లాడితే దాన్ని నువ్వు సమర్థిస్తున్నావు. సమాజంలో అశాంతిని సృష్టించడం, కోర్టులను తప్పదోవపట్టించడం, పోలీసులను వేధింపులకు గురించేయడమే నీ పని. నువ్వు కేసుల గురించి మాకు చెబుతున్నావు. దొంగ కేసులు పెట్టించండం నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. సొంత పార్టీ ఎంపీని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రి ఇప్పించావు. 4 ఏళ్లు నియోజకవర్గానికి రాకుండా అడ్డుకున్నావు. నా సభలకు జనం బాగా వస్తున్నారని చెబుతున్నావ్. వాళ్లంతా జనం కాదు సైకో బ్యాచ్ అదంతా. సిద్ధం సభలకు వేల మందిని వచ్చి నిన్ను ఇంటికి పంపిచేందుకు సిద్ధమని చెప్పారు. అయినా నువ్వు ఇంకా మారలేదు.


*వివేకం సినిమాను ఎందుకు అడ్డుకున్నావ్:*

రపా రపా నరికితే మంచిదేగా సినిమా డైలాగే కదా ప్లకార్డులు పట్టుకుంటే ఎందుకు ఇబ్బంది అంటున్నావ్. వివేకం సినిమాను ఎందుకు ఆపించావు. వివేకం సినిమా కూడా సినిమాలాగే చూడాలి కాదా... సొంత బాబాయ్ ని నువ్వు గొడలితో ఎలా రపా రపా నరికావో మొత్తం క్లియర్ గా ఉంది. అది ప్రజలకు చూపిస్తే ఏమవుతుంది. ఎందుకు కోర్టుకు మరీ వివేకం సినిమాను అడ్డుకున్నావ్. రిలీజ్ చేయొచ్చు కదా ప్రజలు చూస్తారు. 


*పరామర్శల పేరుతో డ్రామాలు:*

బంగారుపాళ్యంలో మామిడి రైతుల పరామర్శకు వెళ్లి నానా ఇబ్బందులకు గురిచేశావ్. కర్ణాటక ముఖ్యమంత్రి మన సీఎం చంద్రబాబు గారికి ఫొన్ చేసి మా రాష్ట్రం మామిడి కొనండని వేడుకున్నాడు. నువ్వు కర్ణాటక ప్రభుత్వం ఎక్కువ ధరకు మామిడి కొంటుందని మాట్లాడుతావ్. చిత్తూరులో మొత్తం పెద్దిరెడ్డి పల్ప్ ఫ్యాక్టరీలే ఉన్నాయి.  సిండికేట్ లా  ఏర్పడి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చూశారు. రూ.12 కి మొత్తం మామిడి కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. 


మా ప్రభుత్వం కఠనంగా ఉంటే న్వువు పర్యటనలు ఎలా చేస్తున్నావ్ జగన్ రెడ్డి. ప్రజాస్వామ్యం బద్దంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టే నీ ఆటలు సాగుతున్నాయి. నీ పాలనలో పవన్ కళ్యాణ్ ను విశాఖ, ఇతర ప్రాంతాల్లో అడ్డుకున్నావ్. చంద్రబాబు గారిని అనేక ఇబ్బందులకు గురి చేసి అడ్డుకున్నావ్. అరెస్టులు చేసి కేసులు పెట్టించావ్. చంద్రబాబు నుంచి కొల్లు రవీంద్ర, దేవినేని, జేసీ, చింతమనేని ఇలా చెప్పుకుంటూ పోతే వేల మందిపై అక్రమ కేసులు పెట్టించి నిర్భందించావు. 75 ఏళ్ల సీనియర్ పాత్రికేయుడు అంకబాబుని కూడా అరెస్ట్ చేయించావు. సిగ్గు లేకుండా మా ప్రభుత్వం వస్తే జాగ్రత్త అంటూ నేడు హెచ్చరిస్తున్నావు. నీ పాలనను మళ్లీ మళ్లీ కావాలని ప్రజలు కోరుకోవడం లేదు. సైకో బ్యాచ్ వస్తున్నారని జనం ఉన్నారని అనుకుంటున్నావ్ అదంతా నీ భ్రమ... ఆ జనం ఏంటో వాళ్లు ఎందుకు డ్రామా అడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. అధికారం ఉన్నప్పుడు పబ్జీ ఆడావు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నావు మళ్లీ అదే పనిచేసుకో. ఈ గొడవలు సృష్టంచడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఎందుకు?. 


మిర్చి రైతుల పర్యామర్శ పేరుతో అల్లర్లు సృష్టించావు. మిర్చి బస్తాలు తొక్కి పడేశారు. మీ కార్యకర్తలే మిర్చి బస్తాలు దోచుకుపోయారు. తెనాలిలో రౌడీ షీటర్లను స్వాతంత్ర్య సమరయోధులైనట్టు పరామర్శించావు. మా తెనాలి ప్రజలంతా నవ్వుకున్నారు. రాప్తాడులో హెలికాప్టర్ డ్రామా ఆడావు. నీ కార్యకర్తలనే నీ హెలికాప్టర్ వద్దకు రప్పించుకొని పోలీసులపై నిందలు వేశావ్. పోలీసు కేసు విచారణకు అయినా వస్తారా అంటే రారు. పొదిలికి వెళ్లి పోగాకు రైతుల పరామర్శ డ్రామా ఆడావు. మహిళలపై రాళ్ల దాడి చేయించావు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏడాది క్రితం బెట్టింగ్ వల్ల చనిపోయిన వాడికి విగ్రహం పెట్టి రెంటపాళ్ల పర్యటన పేరుతో ముగ్గురి ప్రాణాలు తీశావ్.  ప్రజలు అన్ని చూస్తున్నారు. నేడు ప్రజాస్వామ్యబద్ధంగా మేం పాలన సాగిస్తున్నాం. పోలీసులు ఇచ్చే సూచనలు పాటించడం లేదు, కావాలని గొడవలు పడతున్నావ్. హక్కుల గురించి మాట్లాడే హక్కు నీకు ఉందా జగన్ రెడ్డి.


రాష్ట్ర అభివృద్ధిని దుష్టశక్తిలా అడ్డుకుంటున్నావు. నీ ఐదేళ్ల పాలనలో అమర్ రాజా, లూలూ, కియా అనుసంభ సంస్థలు, విశాఖలో కాగ్ని జాంట్, జాకీ పరిశ్రమను తరిమేశావు.  హామీల గురించి మాట్లాడే హక్కు నీకు ఉందా. మొత్తం  బకాయిలు పెట్టిపోయావ్.  మేము వచ్చి విద్యార్థులకు తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంత మంది విద్యార్థులకు ఇస్తున్నాం. నీ హయాంలో విద్యార్థులకు సర్టిఫికేట్లు రాకపోతే మంత్రి నారా లోకేష్ గారు ఇప్పించారు. ఉద్యోగస్థులను నానా హింసలకు గురిచేశావు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కాజేశావ్. మేం వచ్చాక ఆసొమ్మును వారికి ఖతాలో మళ్లీ జమ చేశాం. గవర్నర్ పేరుతో అప్పులు చేవావు. నువ్వు నేడు అప్పుల గురించి మాట్లాడుతావు. నువ్వు పెట్టే ప్రెస్ మీట్ ఒక పెద్ద డ్రామా అని అందరికి అర్థమైంది. ప్రజలు నీ బూటకపు మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కూడా నీకు చేతకావడం లేదు. నీ పార్టీని బతికించుకోవడం కోసం ప్రజలకు ఇబ్బందులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నావు. భయపెట్టి పబ్బం గడుపుకోవాలని జగన్ చూస్తున్నాడు. మళ్లీ వస్తానని జగన్ అంటుంటే జనం నవ్వుకుంటున్నారు.

Comments