ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ.
*మంత్రి నారా లోకేష్ సహకారంతో 30 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ*


*స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న మంత్రి నారా లోకేష్*

*శిక్షణ పొందిన “70”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ*

*కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేసిన నియోజకవర్గ తెలుగు మహిళలు*

మంగళగిరి టౌన్ (ప్రజా అమరావతి): మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్ మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళలకు మంగళవారం ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేశారు. 70వ బ్యాచ్‌లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో నియోజకవర్గ తెలుగు మహిళలు కుట్టుమిషన్లు అందజేశారు. మంత్రి నారా లోకేష్‌కు ల‌బ్దిదారులు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి సాధించడం ద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయన్న ఉద్దేశ్యంతో మంత్రి నారా లోకేష్ స్త్రీ శక్తిని నెలకొల్పి ఉచితంగా మహిళకు కుట్టుమిషన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. మంత్రి నారా లోకేష్ కృషితో మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి నారా లోకేష్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. వైసీపీ హయాంలో మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటే మంత్రి నారా లోకేష్ గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు వాసా పద్మ, నియోజకవర్గం తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపుడి వైష్ణవి, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి వింజమూరి ఆశాబాల, మంగళగిరి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు గడ్డిపాటి అపర్ణ, మండల తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి, శివాలయం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు లావణ్య, మంగళగిరి మార్కెట్ కమిటీ సభ్యులు భైరబోయిన పద్మ, నైనాల లావణ్య, నక్కా రాజేశ్వరి, అంగన్వాడి కమిటీ కార్యదర్శి గడ్డిపాటి తులసి, విజయలక్ష్మి, ట్రైనర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments