ఇంద్రకీలాద్రి,26 జూలై 2025 (ప్రజా అమరావతి);
దుర్గమ్మసన్నిధిలో సేవకు రిజిస్ట్రేషన్ ఆరంభం
విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ వారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఆరంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ తెలిపారు.
కనకదుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ఉచిత సేవ చేసే సేవకులు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భక్తుల సేవలో వినియోగిస్తామని పేర్కొన్నారు.
భక్తులుకు త్రాగు నీరు అందించడం, అన్న ప్రసాద వితరణ,ఉచిత ప్రసాద వితరణ, దర్శనం క్యూ లైన్ల నిర్వహణ, క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ భద్రపరచే ప్రదేశం, భక్తుల ఫీడ్ బ్యాక్ కౌంటర్, లిప్ట్ క్యూ వద్ద,దేవస్థానం బస్ క్యూ వద్ద, పార్కింగ్, టోల్ గేట్ వద్ద వాహనాలు క్రమబద్దీకరణ తదితర చోట్ల సేవకుల, భక్త బృందాల సేవలు వినియోగించనున్నట్లు ఈవో పేర్కొన్నారు.
సేవ చేయడానికి వచ్చే సేవకులు మొదటగా దేవస్థానం వెబ్ సైట్ www.kanakadurgamma.org లో volunteer విభాగం లో join as అ volunteer గా తమ పేరు,ఫోన్ నెంబర్, పూర్తి చిరునామా, ఫోటో, ఆధార్ తో రిజిస్ట్రేషన్ చేయాలని ఈవో వివరించారు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సేవకులకు సేవ ఎప్పుడు కేటాయించాము, ఎన్ని రోజులు, వసతి, అన్న ప్రసాదం, లాకర్ సౌకర్యం, సేవకులకు తాత్కాలిక గుర్తింపు కార్డు, వసతి నుండి దేవస్థానంకి రవాణా సదుపాయాల వివరాలు మెసేజ్ రూపం లో అందేలా పారదర్శకంగా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని,
భక్తి భావంతో అర్హత గలిగిన వ్యక్తులను సేవకు వినియోగిస్తామని ఈవో శీనా నాయక్ వివరించారు.
addComments
Post a Comment