దోమల నివారణతోనే డెంగ్యూ నిర్మూలన.
*దోమల నివారణతోనే డెంగ్యూ నిర్మూలన

*

*-జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి కె. విజయలక్ష్మి*

మంగళగిరి (ప్రజా అమరావతి):

       దోమల నివారణతో డెంగ్యూ వ్యాధి నిర్మూలన సాధ్యమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కె.విజయలక్ష్మి   పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ మహోత్సవాల ముగింపు సందర్భంగా  గురువారం నగరంలోని ఎంపీడీవో కార్యాలయం తెనాలి రోడ్డు వరకూ  నిర్మలా ఫార్మసీ విద్యార్థులతో కలిసి ఆరోగ్య సిబ్బందిర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కె విజయలక్ష్మి మాట్లాడుతూ... దోమ కుట్టడం వలన డెంగ్యూ జ్వరం వస్తుందని తెలిపారు. ప్రతిఒక్కరూ దోమతెరలను వాడాలన్నారు. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతీ శుక్రవారం డ్రైడే నిర్వహించాలన్నారు. ఇంటిలో వినియోగించని పాత్రల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని, పూలకుండీలు, ఫ్రిజ్‌ల్లో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి టిఎంకే సుబ్బరాయణం, ఏఎంఓ రాజు నాయక్,  ఇందిరానగర్ మార్కండేయ కాలనీ వైద్యాధికారులు డాక్టర్ పి.అనూష, డాక్టర్ సతీష్, నిర్మల ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రేఖా నరేష్ బాబు, స్టూడెంట్స్ కోఆర్డినేటర్స్ జి.రాజ రాజేశ్వరి, ఎన్. సుష్మ,  ఎస్ యుఓ లు కె.రామరాజు, సుధీర్, సూపర్వైజర్లు సాగర్, సైదులు తో పాటు పలువురు హెల్త్ అసిస్టెంట్లు, హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, పలువురు జాతీయ సేవా పథకం విద్యార్థులు పాల్గొన్నారు.
Comments