విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులు దుకాణాల పై ఉమ్మడిదాడులు.


అమరావతి (ప్రజా అమరావతి);


విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులు దుకాణాల పై ఉమ్మడిదాడులు


       రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనములు, ఎరువులు మరియు పురుగుమందులు సరసమైన ధరలకు  అందించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి  శ్రీ నారా చంద్ర బాబు నాయుడు  ఆదేశములతో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ శ్రీ  హరీష్ కుమార్ గుప్తా IPS.,  మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్  శ్రీ ఎస్. ఢిల్లీ రావు IAS  ఆదేశములతో విజిలెన్సు మరియు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తము గా 30 బృందాలు ఏర్పడి రాష్ట్ర వ్యాప్తముగా నిన్నటి నుండి అనగా 14-07-2025  తేదీ నుండి తనిఖీ లు నిర్వహించటం జరుగుతున్నది. 

ABSTRACT

14.07.2025

( విత్తనములు+ఎరువులు+పురుగు మందులు/వివరములు)

తనిఖీ చేసిన విత్తనములు , ఎరువులు , పురుగు మందుల దుకాణాల సంఖ్య : 219

అమ్మకములు నిలిపివేసిన వేసిన విలువ : రూ. 1033 లక్షలు 

సెజ్ చేసిన 6 A  కేసులు నమోదు చేసిన విలువ : రూ. 5.38  లక్షలు 

సస్పెండ్ చేసిన లైసెన్స్ల సంఖ్య :01

కాన్సుల్ చేసిన లైసెన్స్ ల సంఖ్య : 03

6 A of EC Act, 1955 ద్వారా నమోదు చేసిన కేసులు : 01

పరీక్ష కొరకు సేకరించిన విత్తన, ఎరువులు, పురుగు మందుల నమూనా సంఖ్య       :48

Seize చేసిన మోతాదు :41` మెట్రిక్ టన్స్ 

Seize చేసిన విలువ :రూ.5.38 లక్షలు 


ది :14 -7 -2025  తనిఖీల  వివరములు

విత్తనాలు: 

తనిఖీలు నిర్వహించిన విత్తనాల దుకాణాల సంఖ్య           : 45   

అమ్మకములు నిలిపివేసిన విత్తనాల పరిమాణము : 75 కింట్వల్

అమ్మకములు నిలిపివేసిన విత్తన విలువ :  రూ. 61  లక్షలు

రద్దు చేసిన విత్తన లైసెన్స్ ల సంఖ్య : 02

పరీక్ష కొరకు సేకరించిన విత్తన నమూనా సంఖ్య : 16


ఎరువులు :

తనిఖీలు నిర్వహించిన ఎరువుల షాపుల సంఖ్య : 99

అమ్మకములు నిలిపివేసిన ఎరువుల మోతాదు :2225.మెట్రిక్ టన్నులు 

సెజ్ చేసిన ఎరువులు విలువ : రూ. 638 లక్షలు  

సెజ్ చేసిన ఎరువులు మోతాదు : 40.93  మెట్రిక్ టన్నులు 

సెజ్ చేసిన ఎరువుల విలువ : రూ. 5.38 లక్షలు 

సస్పెండ్ చేసిన ఎరువుల లైసెన్సులు : 01

రద్దు చేసిన ఎరువుల లైసెన్సులు : 01

6 A of EC Act, 1955 ద్వారా నమోదు చేసిన కేసులు సంఖ్య : 01

పరీక్ష కొరకు సేకరించిన ఎరువులు నమూనాల సంఖ్య : 16


పురుగుల మందులు :

తనిఖీలు నిర్వహించిన పురుగు మందుల షాపులు సంఖ్య : 75

అమ్మకాలు నిలిపివేసిన పురుగు మందుల మోతాదు : 25,317 లీటర్లు /కిలోలు 

అమ్మకాలు నిలిపివేసిన పురుగు మందుల విలువ : రూ.  335 లక్షలు

పరీక్ష కొరకు సేకరించిన పురుగు మందుల నమూనా సంఖ్య : 16


వ్యాపారస్తులకు హెచ్చరిక: 

వ్యాపారస్తులు నియమనిబంధనలకు లోబడి వ్యాపారము నిర్వహించుకోవాలి. ఎరువులు దాచి ఉంచిన, అధికధరలకు విక్రయించినా , చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని, ఈ దాడులు నిరంతరము కొనసాగుతాయి అని హెచ్చరించారు.



Comments