యుద్ద‌ప్రాతిప‌దిక‌న పాలేరు సాగ‌ర్ యూటీ ప‌నులు పూర్తి.

🔹యుద్ద‌ప్రాతిప‌దిక‌న పాలేరు సాగ‌ర్ యూటీ ప‌నులు పూర్తి


🔹రేపు పాలేరు జలాశయం నుండి రెండో జోన్ కు నీటి విడుదల


 ఖమ్మం (ప్రజా అమరావతి);


    ఖ‌మ్మం జిల్లాలో సుమారు నాలుగు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీటిని అందించే  పాలేరులోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ ప్ర‌ధాన కాలువ అండ‌ర్ ట‌న్నెల్ (యూటీ) నిర్మాణ ప‌నుల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న  పూర్తి చేసి రేపటి (సోమవారం) నుంచి 1500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం.. రేపు ఉదయం 10గంటలకు డిప్యూటీ సీఎం Bhatti Vikramarka Mallu  తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది


కూసుమంచి మండ‌లం జుజ్జుల‌రావుపేట‌లో జ‌రుగుతున్న‌ పాలేరు సాగ‌ర్ కాలువ ప‌నుల‌ను  జిల్లా కలెక్టరుతో కలిసి ఆదివారం రాత్రి ఆకస్మికంగా త‌నిఖీ చేయడం జరిగింది.


గత ఏడాది కురిసిన భారీ వ‌ర్షాల‌కు సెప్టెంబర్‌లో పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని కూసుమంచి మండ‌లం జుజ్జుల‌రావు పేట స‌మీపంలో పాలేరు రిజర్వాయ‌ర్ ద‌గ్గ‌ర ప్ర‌ధాన కాలువ‌పై అండ‌ర్ ట‌న్నెల్ (యూటీ) కొట్టుక‌పోయింది. రైతుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో అప్ప‌ట్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసి సాగునీటిని అందించడం జరిగింది. ముఖ్యమంత్రి Anumula Revanth Reddy  సూచన మేరకు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి Uttam Kumar Reddy  సహకారంతో యూటీ పనులు పూర్తి చేసాం. 


శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న రూ 14.20 కోట్లతో  ఈ యూటీ కాలువ మ‌ర‌మ్మ‌తుల‌ను ప్రారంభించ‌డం జ‌రిగింది. ఖ‌మ్మం జిల్లాలో వ్య‌వ‌సాయ రంగానికి జీవ‌నాధార‌మైన ఈ కాలువ మ‌ర‌మ్మ‌తుల‌ను పూర్తిచేసి సాగునీరు అందిస్తాం. దీనివ‌ల‌న ఖ‌మ్మం జిల్లాలో సుమారు నాలుగు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుండ‌గా ఒక్క పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో 1.33 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంది. 


వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రాధాన్య‌తా క్రమంలో రోజు కు  రెండు షిఫ్ట్‌ల క్ర‌మంలో ప‌నిచేసి గ‌డువులోగా నిర్మాణ‌ ప‌నుల‌ను పూర్తి చేయడం జరిగింది.



Comments