*మహిళలు పేదరికం నుంచి తలెత్తి నిలవాలి*
*53,746 ఎస్ హెచ్ జి సభ్యులకు రూ.437 కోట్ల బ్యాంకు లింకేజ్ పంపిణీ*
*కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్*
పుట్టపర్తి, జులై 10 (ప్రజా అమరావతి): రైతులే దేశానికి బలమని.. మహిళలు పేదరికం నుంచి తలెత్తి నిలవాలని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
గురువారం పుట్టపర్తి మండలం, పెడబల్లి గ్రామ పొలాల్లో రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో జరిగిన ముఖాముఖి సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ ట్.ఎస్.చేతన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ..రైతులే దేశానికి బలం అని నలుమూలలకూ ఆహారం అందించే బంధంలాంటి రైతు సమాజం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధిలో రైతుల పాత్ర అత్యంత కీలకమని గుర్తుచేశారు.
ఇక్కడ జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ సూచించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. "ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. ఇది దేశానికి ఆదర్శంగా మారుతుంది" అని మంత్రి గారు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి, తక్కువ భూమిలోనూ అధిక లాభాన్ని సాధించవచ్చని, దీనివల్ల చిన్న రైతులకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
మహిళా సంఘాల సాధికారతపై మాట్లాడుతూ,
మన సోదరీమణులు ఇప్పుడు స్వయం సమర్థులవుతున్నారు. ఎవరి మీదా ఆధారపడకుండా, గౌరవంగా జీవించేందుకు ముందడుగు వేస్తున్నారు. పేదరికం నుంచి బయటపడుతూ, సమాజంలో తలెత్తి నిలవాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు. ఇది ఎంతో అభినందనీయం అని తెలిపారు.
తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన "లాడ్లీ బహనా యోజన"ను గుర్తు చేస్తూ, మహిళల సాధికారతకు నేను ప్రాధాన్యం ఇస్తాను. రైతుల సేవ చేయడం అంటే నాకు భగవంతుని సేవ లాంటిది అని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా పుట్టపర్తి, అనంతపురం.. ఉమ్మడి జిల్లాలకు చెందిన 53,746 ఎస్ హెచ్ జి సభ్యులకు రూ.437.09 కోట్ల బ్యాంకు లింకేజ్ చెక్కును అందించారు
అంతకు ముందు పెడబల్లి గ్రామంలో సేంద్రీయ పద్దతిలో సాగు చేసిన మిశ్రమ పంటను పరిశీలించారు. అలాగే వర్షాభావం వల్ల ఎండిన పంటలపై ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు. ముందుగా ఎస్ హెచ్ జి మహిళల ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది
ఈ కార్యక్రమంలో జేసి అభిషేక్ కుమార్,భారత ప్రభుత్వ రైతుల సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పేర్ని దేవి, రాష్ట్ర SERP సీ.ఈ.ఓ వి.కరుణ,
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు అగ్రికల్చర్ ,మార్కెటింగ్ , సహకార సంస్థ చైర్మన్ టి. విజయ్ కుమార్,
డిఆర్డీఏ పీడి నర్సయ్య, రైతులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment