టెక్కలి (ప్రజా అమరావతి);
*రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
*
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు .
*రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి వర్యులు*
కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గౌరవ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుగారు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం టెక్కలి లో రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ
వైకాపా ప్రభుత్వం రైతుసంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. రైతులకు రాయితీపై యంత్రాలను పంపిణీ చేశామని చెప్పారు.శివారు భూములకు కూడా ఈ ఖరీఫ్‌లో పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.దాత సుఖీ భవ పథకం కింద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో తెదేపా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment