మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు చర్యలు –– జిల్లా ఇంచార్జి కలెక్టర్.


*మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు చర్యలు –– జిల్లా ఇంచార్జి కలెక్టర్

*

మచిలీపట్నం: జూలై 28 (ప్రజా అమరావతి);

మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం అమలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు.

సోమవారం మధ్యాహ్నం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ అధ్యక్షతన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎం ఎం ఎస్ వై) పథక జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో మత్స్య, వ్యవసాయ, నీటిపారుదల, డి ఆర్ డి ఏ, గిరిజన, ఎస్సీ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులతో పీఎం ఎం ఎస్ వై పథక పురోగతిపై సమీక్షించారు.

సమావేశంలో పీఎం ఎం ఎస్ వై పథకంలోని వివిధ పథకాలకు సంబంధించిన 83 మంది లబ్ధిదారుల దరఖాస్తులను కమిటీ ఆమోదించింది. దీనితో పాటు సముద్ర తాబేళ్ల సంరక్షణకు సంబంధించిన 62 మెకనైజ్డ్ పడవలకు సంబంధించి 13 టర్టిల్ ఎక్స్ క్లూడర్ డివైస్ దరఖాస్తులను కమిటీ ఆమోదించింది.

ఈ సమావేశంలో మత్స్య శాఖ అధికారి నాగరాజ, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, డిటిడబ్ల్యూఓ ఫణి ధూర్జటి, ఎల్ డి ఎం రవీంద్రారెడ్డి, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడి మణిదర్ తదితరులు పాల్గొన్నారు. 

Comments