*రైతులు ప్రభుత్వ రాయితీలను వినియోగించుకోవాలి
*
*పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులకు అవగాహన*
*రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న*
*రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు*
మంగళగిరి (ప్రజా అమరావతి);
మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమానికి వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ బి రాజశేఖర్, వ్యవసాయ కమిషనర్ ఢిల్లీ రావు హాజరై రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వారు గ్రామంలోని వివిధ సాగు పద్ధతులు నిర్వహణ గురించి చర్చించారు. రైతులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటు వ్యవసాయానికి అవసరమయ్యే పరికరాలను అందజేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలా పొందాలి వ్యవసాయం లాభ సాటిగా చేసుకొనుటకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. రైతు సేవా కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వినియోగించుకోవాలని రైతులకు తెలిపారు. కౌలు రైతులు తప్పనిసరిగా సిసి ఆర్సి కార్డులు తీసుకోవాలని దీని ద్వారా ఈ పంట నమోదు పంట నష్టం జరిగినప్పుడు రైతు పేరు నమోదు చేయుటకు అవకాశం ఉంటుందన్నారు. భూసారా పరీక్షలను అనుసరించి రైతులు రసాయనక ఎరువులు వినియోగించాలని సూచించారు. మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చందు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ఆయన అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసమే కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చిందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా వర్షాలు పడినప్పుడు రైతులు ధాన్యాన్ని టార్ఫ్లిన్ పట్టాలతో భద్రపరచుకునే విధంగా రైతులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన వారికి సూచించారు. రైతులు రైతు భరోసా కేంద్రాలలో నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన తెలిపారు. విపత్తుల వల్ల పంట నష్టం జరిగినప్పుడు పెట్టుబడి సాయం త్వరగా అందుతుందని జవ్వాది తెలియజేశారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యల గురించి తగు సూచనలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన వన అడిషనల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, మంగళగిరి ఏడిఏ తోటకూర శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి శైలజా రాణి, మండల ఉద్యానవన అధికారి దీపిక, ఏపీ సీఎం అఫ్ డిపిఎం రాజకుమారి, ఏ ఈ ఓ లు, వీ ఎలు, వీహెచ్ఎలు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment