*వైస్ చైర్మన్ గా చలసాని రాఘవేంద్రరావు*
*డైరెక్టర్లుగా 19 మంది ఎన్నిక*
విశాఖపట్నం (ప్రజా అమరావతి);
సహకార రంగంలో విశాఖకు గుర్తింపును తీసుకొని వచ్చిన 110 సంవత్సరాల విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్, వైస్-ఛైర్మన్లుగా జె.వి.సత్యనారాయణ మూర్తి, చలసాని రాఘవేంద్రరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నేడు దేశంలో పనిచేస్తున్న 1472 సహకార అర్బన్ బ్యాంకులలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద అర్బన్ బ్యాంకు కాగా, దేశంలోని అర్బన్ బ్యాంకులలో ఆర్థిక కార్యకలాపాల రీత్యా మొదటి 10-15 స్థానాలలో నిలిచింది. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నగరంలోనూ బ్రాంచిలు కలిగి ఉండడంతో బహుళ రాష్ట్రాల సహకార సంఘంగా మార్పు చెంది రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు సహకార సేవలను అందిస్తున్నది. 1.12 లక్షల మంది షేరుహోల్డర్లు రూ.400 కోట్ల షేరుధనం కలిగి వుండి సైతం ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా పాలకవర్గ ఎన్నికలు మూడు దశాబ్దాలుగా ఏకగ్రీవంగా జరగడం బ్యాంకు ప్రత్యేకతగా చెప్పవచ్చును.
రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్రప్రభుత్వం నియమించిన సహకార ఎన్నికల అధారిటీ విశాఖ జిల్లా కలెక్టర్ ను ఎన్నికల అధికారిగా నియమించడంతో జూన్ 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషను అనుసరించి సహకార శాఖ అధికారుల ద్వారా నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అన్ని కేటగిరీలకు సంబంధించి 21 మంది మాత్రమే పోటీలో ఉండడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జూలై 25న ప్రకటించారు. చైర్మన్, వైస్-ఛైర్మన్ ఎన్నికను మంగళవారం నిర్వహించగా జె.వి. సత్యనారాయణ మూర్తి ఛైర్మన్ గాను, చలసాని రాఘవేంద్రరావు వైస్-ఛైర్మన్ గాను, డైరెక్టర్లు ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్, వైస్-ఛైర్మన్లతోపాటు డైరెక్టర్లును మాజీ చైర్మన్ మానం ఆంజనేయులు, ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అభినందించారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లకు చైర్మన్, వైస్ చైర్మన్లు ధన్యవాదాలు తెలియజేశారు. తమపై పరిపూర్ణ విశ్వాసం ప్రకటించిన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
2025-2030 మధ్యన బ్యాంకు డైరెక్టర్లుగా ఎన్నికైన 19 మంది పేర్లు.
సూర్పనేని నాగభూషణ చౌదరి,ఎ.జె. స్టాలిన్ , వీరఘంట చంద్రశేఖర్ , గుళ్ళపల్లి జనార్ధనరావు, చెరువు ఆదినారాయణ శాస్త్రి, కండాపు ప్రసాదరావు, ఉప్పలపాటి పార్వతీ దేవి, చిన్నం కోటేశ్వరరావు, సాల్యం నారాయణ స్వామి, చెలికాని కృష్ణమోహనరావు, ఆచాళ్ళ రామకృష్ణారావు,ఈమని అవని,
చుక్కపల్లి రామారావు, నన్నపనేని అంజయ్య, పులిగెడ్డ వెంకట నరసింహమూర్తి, జొన్నలగడ్డ ప్రసాద్ , పిడికిటి మల్లిఖార్జునరావు,
కోగంటి శ్రీకాంత్ బాబు, కేసరి నిర్మల...
addComments
Post a Comment