ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు.

 

భద్రాద్రి కొత్తగూడెం (ప్రజా అమరావతి);



   ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. 


    ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు జారే ఆదినారాయణ గారితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయి సంబురాల్లో భాగంగా ఆడబిడ్డలకు నిర్వహించిన క్రీడా పోటీలను ప్రారంభించి, విజేతలకు బహుమతులను అందజేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. 18 నెలల ఇందిరమ్మ పాలనలో మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారో ఈరోజు ఇక్కడ మహిళలను చూస్తే స్పష్టంగా కనిపించింది. ఇందిరమ్మ పరిపాలన అంటేనే పేదవారి కోసం తపించే ప్రభుత్వం.గత ముఖ్యమంత్రి ధనిక తెలంగాణ రాష్ట్రానికి  8 లక్షల 19 వేల కోట్ల అప్పు తెచ్చి పేదల కోసం ఒక్క పని చేయలేదు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరు మీద ఆ డబ్బంతా కమీషన్లతో దోచుకుతిన్నారు. ఏ ప్రాజెక్ట్ అయితే అద్భుతం, ప్రపంచంలో ఎనిమిదో వింత అని ప్రగల్భాలు పలికారో అది కుప్ప కూలిపోయింది.

గత ప్రభుత్వం మహిళా సంఘాలకు డబ్బులు ఇవ్వలేదు. ఎన్ని అప్పులున్నా ఆడబిడ్డలకు ఇబ్బందులు కలగకూడదని మన  ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాము. రాబోయే మూడున్నరేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాడు రాష్ట్రంలో 60 లక్షల మంది ఇందిరా మహిళా శక్తి సభ్యులున్నారు. వీరికి ఇంతకు ముందు వయో పరిమితి ఉండేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వయోపరిమితిని సడలించింది. 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు వారు సభ్యులుగా ఉండవచ్చు.ఆనాడు ధనిక ప్రభుత్వంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు  ప్రమాద బీమా ఉన్నప్పటికీ గత పాలకులు  బీమా ప్రీమియం డబ్బులు కూడా చెల్లించలేదు. ఈరోజు మన ప్రభుత్వం  రూ. 2 లక్షలు ప్రమాద బీమానే కాకుండా అనుకోని సంఘటన జరిగి ప్రాణాలు కోల్పోతే రూ.10 లక్షల వచ్చే బీమా చేశాం. 18 నెలల్లో రూ.865  కోట్లు పావలా వడ్డీ రుణాలు మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేశాం. ఒక్క అశ్వారావుపేట నియోజకవర్గంలోనే 3255 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈరోజు 3 కోట్ల 23 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కు అందజేయడం జరిగింది. ఇది గాక 219 సంఘాలకు 21 కోట్ల 52 లక్షల బ్యాంక్ లింకేజ్  చెక్కు, 9 లక్షల 56 వేల 163 రూపాయల లోన్ బీమా చెక్కు, ముల్కలపల్లి మండలంలో మినీ గోదాముల ఏర్పాటుకు రూ.15 లక్షల చెక్కు, ఆర్టీసీలో అద్దె బస్సు పెట్టిన ముల్కలపల్లి మండల సమాఖ్యకు మొదటి  EMI కింద రూ.69.468 వేల చెక్కును అందజేశాము. పదేండ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మాది మాటల ప్రభుత్వం కాదు...చేతల ప్రభుత్వం. ఇది పేదవారి  కన్నీరు తుడిచే ప్రభుత్వం.



Comments