ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన, సహజ వ్యవసాయంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు : కృష్ణ జిల్లా కలెక్టర్ డికె బాలాజీ




ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన, సహజ వ్యవసాయంతో  దీర్ఘకాలిక ప్రయోజనాలు : కృష్ణ జిల్లా కలెక్టర్ డికె బాలాజీ








 11 జులై 2025, మచిలీపట్నం (ప్రజా అమరావతి);



కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం సూర్య ఘర్ యోజన, సహజ వ్యవసాయం వంటి పథకాల ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలనిచ్చే పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పీఐబీ నిర్వహించిన వార్తాలాప్ కార్యక్రమంలో కృష్ణ జిల్లా కలెక్టర్ డికె బాలాజీ పత్రికా విలేకరులకు సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో జర్నలిస్టులు మరియు మీడియా పాత్రను కీలకమని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చెరవేయాలని విజ్ఞప్తి చేశారు.


కేంద్ర పథకాలపై సమాచారాన్ని సమర్థవంతంగా వ్యాప్తి చేయడం వంటి కీలక అంశాల గురించి జర్నలిస్టులకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి)  శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక రోజు మీడియా వర్క్‌షాప్‌ వార్తాలాప్ కార్యక్రమం నిర్వహించింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గ హాజరైన కృష్ణ జిల్లా కలెక్టర్ బాలాజీ వికసిత భారతానికి అమృత కాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 ఏళ్ళ  అనే శీర్షికతో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురణను కూడా ఆయన విడుదల చేశారు.



వార్తాలాప్ లో పాల్గొన్న విలేకరులను ఉద్దేశించి మాట్లాడుతూ, “ప్రజా విధానాలను పౌరులకు తెలియజేయడంలో జర్నలిస్టులు కీలక బాధ్యతను పోషిస్తారు మరియు కొత్త విధానాలను రూపొందించడంలో మరియు వాటిని అమలులలో కూడా కీలక బాధ్యత వహిస్తారు” అని కలెక్టర్ బాలాజీ అన్నారు. జర్నలిస్టుల బాధ్యతలను నొక్కి చెబుతూ, సహజ వ్యవసాయంలో విజయగాథలను ప్రాచుర్యం కల్పించడం ద్వారా సమాజంలోని ఇతర ప్రాంతాలలోని తోటి రైతులు ప్రేరేపితమవుతారని కలెక్టర్ అన్నారు.


వార్తాలాప్ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ  మీడియా  నైతికతలను పాటించాలని సూచించారు. ప్రజలకు తనిఖీ చేసుకున్న వాస్తవాలను మాత్రమే అందజేయాలని కోరారు.


పత్రికా స్వేచ్ఛ యొక్క చట్టపరమైన అంశాలపై, సహేతుకమైన ఆంక్షలు, పరువు నష్టం, దేశద్రోహం మరియు కోర్టు ధిక్కారంతో సహా  పలు అంశాలను  జిల్లా సీనియర్ సివిల్ జడ్జి , DLSA కార్యదర్శి కె.వి. రామకృష్ణయ్య  వార్తాలాప్ లో జర్నలిస్టులకు వివరించారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం, ఏవైనా చట్టపరమైన విషయాలను ఉచితంగా పరిష్కరించడంపై అవగాహన కల్పించాలని కూడా ఆయన జర్నలిస్టులను కోరారు. అదేవిధంగా, హిందూ లా కళాశాల ప్రిన్సిపాల్ DSR, VJS రాయలు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు కొత్త క్రిమినల్ చట్టాల గురించి వర్క్‌షాప్‌లో జర్నలిస్టులకు వివరించారు.


పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (P4) పథకం మరియు సహజ వ్యవసాయాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలని కృష్ణ జిల్లా సహకార మార్కెట్ సొసైటీ (DCMS) చైర్మన్ బండి రామకృష్ణ మీడియాను కోరారు.


PIB డైరెక్టర్ పి. రత్నాకర్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ప్రాంతీయ స్థాయిలో మీడియాకు సమర్థవంతంగా వ్యాప్తి చేయడానికి I&B మంత్రిత్వ శాఖ యొక్క వివిధ మీడియా కార్యకలాపాలను వివరించారు. CBC అదనపు డైరెక్టర్ ఆర్. రమేష్ చంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.


వార్తాలాప్ లో మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ చేసిన సమగ్ర ప్రయత్నాలను అభినందించారు.


Comments