గుంటూరు, 08 జూలై 2025 (ప్రజా అమరావతి):- జిల్లాను పేదరిక రహితంగా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన ప్రజలు, ప్రభుత్వం, దాతలు భాగస్వామ్యం (పీ4) కార్యక్రమాన్ని జిల్లాలో, నియోజకవర్గంలో సమర్ధవంతంగా అమలు జరిగేలా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన గుంటూరు జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ,జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టీనా, రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, శాసనసభ్యులు గళ్లా మాధవి, మహమ్మద్ నసీర్ అహ్మద్ , ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ , తెనాలి శ్రావణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లిఖార్జనరావు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు తో కలసి పాల్గొన్నారు. సమావేశంలో ఏటీఆర్ పై, వ్యవసాయం, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇరిగేషన్, సివిల్ సప్లయిస్ (రేషను కార్డులు), తల్లికి వందనం, స్వర్ణాంధ్రా 2047 తదితర అంజెండా అంశాలపై చర్చించారు. ఈ సంధర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పీ4 కార్యక్రమం ద్వారా పేదరికం లేని సమాజాలు తీర్చిదిద్దటానికి సమాజ వనరులను వినియోగించుకొని అభివృద్ది చెందిన మార్గదర్శులను, పేదరికంలోని బంగారు కుటుంభాలను సమన్వయ పరిచేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాల
న్నారు. సీసీఆర్సీ కార్డుదారులకు రుణాలు మంజూరు అయ్యేలా రెవెన్యూ, వ్యవసాయశాఖ, బ్యాంకర్లు తో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నీటిపారుదల శాఖ ద్వారా కెనాల్స్ వద్ద జరుగుతున్న పనులను నీటి సంఘాలతో సమన్వయం చేసుకుంటూ అధికారులు పర్యవేక్షించాలన్నారు. నాచురల్ ఫార్మింగ్ ను ప్రోత్సహించేలా వ్యవసాయశాఖ అధికారుల చర్యలు తీసుకోవాలన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీ4 విధానంపై మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పీ4 విధానాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని వెల్లడించారు. వికసిత్ భారత్ లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాకారం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో అధికారులు, రాజకీయ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించిన లక్ష్యం సాధించాలన్నారు. గత డీఆర్సీలో 12వేల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని,సంబంధిత రైతులు రుణం తీసుకోకుండా ఉన్నారని గుర్తించి వాళ్లకు రబీ సీజన్ లో రుణాలు ఇవ్వాలన్న ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో వ్యవసాయశాఖ, లీడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో కౌలు రైతు సంఘం ప్రతినిధులను సమన్వయపరిచి దాదాపు 3 వేల మంది రైతులకు రూ.14 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 27 డిసెంబర్ 2024న జరిగిన గ్యాస్ ప్రమాదం వల్ల బాధితులకు నష్టపరిహారం అందడంలో అలసత్వం పనికిరాదని సంబంధిత గ్యాస్ ఏజెన్సీని హెచ్చరించారు.గుంటూరు జిల్లాలోని మత్స్యకారులకు మత్స్యశాఖ అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని ఫిషరీస్ అధికారులు మంత్రి దుర్గేష్ కు వివరించారు. కిసాన్ డ్రోన్ గ్రూప్ లో పైలట్ నియామకానికి డిగ్రీ నిబంధన సడలిస్తే ఎక్కువ మందికి అవకాశం కలుగుతుందన్న అంశంపై మంత్రి దుర్గేష్ అధికారులతో మాట్లాడారు. ఆసక్తి గల 5-6 మంది రైతులను ఒక బృందంగా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ పాసైన 18-50 సంవత్సరాల వయసు గల రైతులను డ్రోన్ పైలట్ గా ఎంపిక చేసినట్లు అధికారులు వివరించారు. మేడికొండూరులో బినామీ రైతులు నష్టపరిహారం సొమ్ము పొందిన అంశంలో పెద్ద రైతులను వదిలేసి చిన్నకారు రైతులను పట్టుకున్నారన్న అంశంపై మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ చట్టం అందరికీ సమానంగా వర్తించాలని పోలీస్ శాఖకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో ఆగస్టు 15 నాటికి 81,264 మందిని బంగారు కుటుంబాలను గుర్తించాలనే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి దుర్గేష్ అధికారులకు తెలిపారు. హౌస్ హోల్డ్ సర్వే లో ఎడిట్ ఆప్షన్ అంశాన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. సకాలంలో కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు రుణాలు మంజూరు చేసే విషయంలో సాంకేతిక కారణాలు సాకుగా చూపి ఇవ్వకపోవడం, వ్యవహారశైలి తదితర అంశాల్లో బ్యాంకర్లు తమ విధానం మార్చుకోవాలన్నారు. రైతులను ఇబ్బందికి గురిచేస్తే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు,బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని కలెక్టర్ కు సూచించారు. అదే విధంగా బ్యాంకర్లు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో ఒక బృందం ఏర్పాటు చేసి సకాలంలో రైతులకు లోన్లు మంజూరయ్యేందుకు కృషి చేయాలన్నారు. దాతలు ఏదైనా ప్రణాళికతో ముందుకు వచ్చినప్పుడు జీజీహెచ్ అధికారులు త్వరితగతిన అగ్రిమెంట్ పూర్తికి చర్యలు తీసుకోవాలని మంత్రి దుర్గేష్ సూచించారు. వెంటనే అనుమతులు ఇచ్చి పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు జిల్లా 5 ఏళ్ల యాక్షన్ ప్లాన్ (2024-29)ను పరిశీలించి గుంటూరు జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసి పనిచేద్దామని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా, పట్టణాల్లో అమృత్ 2 పథకం ద్వారా ద్వారా త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, పట్టణాల్లో అమృత్ 2 ద్వారా అందిస్తామన్నారు. డీఆర్సీ లో చర్చించిన అంశాల్లో రాష్ట్ర స్థాయిలో వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో అంశాలు జిల్లా యంత్రాంగం ద్వారా పరిష్కారించటం జరుగుతుందన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ కౌలు రైతులకు పంట రుణాలు మంజూరుకు రెవెన్యూ, వ్యవసాయశాఖ, బ్యాంకర్లుతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో పీ4 పధకం సమర్దవంతంగా అమలు చేసేందుకు వివిధ రంగాల్లోని మార్గదర్శులను గుర్తించి ఎంపిక చేసిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ మంగళగిరిలో పెరుగుతున్న జనభాకు అనుగుణంగా మంచినీటి సరఫరా చేయాలని, డ్రైయిన్లు నిర్మించాలన్నారు. జాతీయ రహదారి సర్వీస్ రోడ్ లో విద్యుత్ దీపాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ఇంటి పట్టాలను పంపిణీ చేయాలన్నారు. కల్తీ విత్తనాలు, పురుగుమందులు విక్రయాలు జరకుండ చర్యలు తీసుకోవాలని, ప్రస్తుత వాతవరణ పరిస్థితులకు అనుగుణంగా అత్యధిక దిగుబడి వచ్చే ప్రత్యమ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డులు అందించి బ్యాంకర్లు ద్వారా పంటరుణాలు మంజూరు చేసేలా రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. దేవదాయశాఖ భూములు సాగు చేసుకుంటున్న కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందించాలన్నారు. తాడికొండ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మంచినీటికి ఇబ్బందులు ఉన్నాయని పరిష్కర దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిరంగపురం చర్చిని, సమీపంలోని కొండవీడు కోటను కలిపి టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయటానికి చర్యలు తీసుకోవాలన్నారు.
శాసనసభ్యులు దూళిపాళ్ళ నరేంద్రకుమార్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు అర్హులు, అనర్హుల వివరాలు స్థానిక అధికారుల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. పథకానికి అనర్హతకు గల కారణాలను తెలియచేయాలన్నారు. గతంలో నిర్వహించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వలన అర్హులు సైతం సంక్షేమ పథకాలకు అనర్హులు అవుతున్నారని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎడిట్ కు అవకాశం కల్పించాలన్నారు. ఒంటరి మహిళా పెన్షన్లు నిబంధనలు సరళతరం చేయాలని, పెదకాకాని జాతీయ రహదారిపై ప్రమాదాలకు కారణం అవుతున్న భవనం తొలగింపుకు నష్ట పరిహారం సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దు అయిన జల్ జీవన్ పనులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ఆటోనగర్ లో కనీస మౌలిక సౌకర్యాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నగరపాలక సంస్థ ఆటోనగర్ మంచినీటి కుళాయిల ఏర్పాటుకు డిపాజిట్ నగదు రూ.5000కు తగ్గించాలన్నారు. బొంగరాలబీడు కార్మికశాఖ స్థలంలో నిర్మించే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని విభాగాలను పూర్తి స్థాయిలో సమగ్రంగా నిర్మించాలన్నారు, రైల్వే స్టేషన్లు, ఆటోనగర్ వద్ద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, రాజీవ్ గృహ కల్ప వద్ద అంగన్వాడీ కేంద్రంను ఏర్పాటు చేయాలన్నారు.
శాసనసభ్యులు గళ్లా మాధవి మాట్లాడుతూ పశ్చిమ నియోజకర్గం పరిధిలో రహదారుల పక్కన నాటిన ఆస్టోనియా స్కాలరిక్స్ వలన పర్యావరణానికి హాని జరుగుతుందని, వాటిని తొలగించాలన్నారు. రహదారుల ప్రక్కన ఉన్న మిర్చి తొడియాలు రహదారుల పక్కన వేయకుండా, వాటిని తగలబెట్టడం వలన ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని, వీటిపై పరిష్కరదిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
“ఒక జిల్లా ఒక ఉత్పత్తి” గుంటూరు మిర్చికి వచ్చిన జాతీయ అవార్డును జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా జూలై 14వ తేదీన అందుకుంటున్నందున సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టీనా, రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ, శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, ఏసురత్నం, శాసనసభ్యులు గళ్లా మాధవి, దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ , తెనాలి శ్రావణ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లిఖార్జనరావు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, జిల్లా అధికారులు హర్షం వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీని ప్రత్యేకంగా అభినందించారు.
సమావేశం అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విలేకరులతో మంత్రి మాట్లాడుతూ డీఆర్సీ సమావేశంలో గత సమావేశంలో చర్చించిన అంశాలపై నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎంత మేర పూర్తిచేశారు, పనుల పురోగతి పైన వ్యవసాయం, పీ4, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఇతర అజెండా అంశాలపై ప్రజాప్రతినిధులు తెలిపిన విషయాలు, అందించిన ముఖ్యమైన సలహాలపై జిల్లా అధికారులతో కలసి 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి స్పష్టమైన కార్యాచరణతో రూపొందించుకున్నామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించామన్నారు. . ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సూపర్ -6 పథకాలు అమలు చేస్తున్నామని అందులో భాగంగా తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, దీపం-2 పథకాల తదితర పథకాల అమలుతీరుపై చర్చించామన్నారు. సౌకర్యవంతంగా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసి తీరుతామన్నారు. సంతృప్త స్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పథకాల అమలు జరగడం లేదని ఆరోపిస్తున్న వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చర్చకు సిద్ధమా అన్నారు. దేశంలో ఎక్కడా అమల్లో లేని కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వాటన్నింటిని ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జిల్లా విజన్ డాక్యుమెంట్, నియోజకవర్గాల విజన్ డాక్యుమెంట్, బంగారు కుటుంబాల గుర్తింపు,మార్గదర్శులను గుర్తించాలని నిర్ణయించామన్నారు. పీ4తో పేదరిక నిర్మూలన చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులతో ఈ అంశంపై చర్చించామన్నారు.గుంటూరును పేదరిక రహిత జిల్లాగా చేయాలని నిర్ణయించామన్నారు. రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అగ్రగ్రామిగా నిలబెడుతామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతులకు మేలు చేయాలన్న సత్సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామన్నారు. వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించి తద్వారా మేలు కలిగించే కిసాన్ డ్రోన్ లను రైతులకు సబ్సిడీకే అందిస్తున్నామన్నారు. గతం కంటే ఎక్కువగా అన్నదాత సుఖీభవ క్రింద రైతులకు రూ.20,000 పెట్టుబడిసాయం అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల క్రింద వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ను రూ.4000 కు పెంచామన్నారు. దివ్యాంగులకు రూ.6000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.15,000 ఇస్తున్నామన్నారు. ఈ అంశాలన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా సమీక్ష సమావేశంలో చర్చించిన అని అంశాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment