నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు - ఈవో శీనా నాయక్


ఇంద్రకీలాద్రి, 31 జూలై 2025 (ప్రజా అమరావతి);

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు - ఈవో శీనా నాయక్
- నలుగురు సెక్యూరిటీ గార్డులపై వేటు

 దేవస్థానం నిబంధనలు అతిక్రమించిన ఏ స్థాయి ఉద్యోగి అయినా సహించేది లేదని, దేవస్థానం ప్రతిష్ట ప్రధానమని ఈవో వి. కె. శీనానాయక్ పేర్కొన్నారు.

వేద పాఠశాల పరిశీలన తర్వాత పోరంకి నుండి దేవస్థానం చేరుకుంటున్న సమయంలో కనకదుర్గా నగర్ ప్రవేశ ద్వారం నుండి  మహామండపం లిఫ్ట్ ప్రాంతం వరకు ఒక ఆటో అనుమతించి, ఆ ఆటోలో కొన్ని పెద్ద పెద్ద హాట్ బాక్స్ ల్లో బయటనుండి తీసుకువచ్చిన తిను బండారములను  ఈవో స్వయంగా గుర్తించారు. 

విచారణ చేయగా ఒక అపరిచిత వ్యక్తి దేవస్థానం లో భక్తులకు పంపిణీ చేయడానికి ఆహారపదార్థం తెచ్చారని తెలిసింది.

అనుమతి లేకుండా బయట పదార్థములు దేవస్థానం ప్రాంగణం లోనికి అనుమతించి, భక్తుల భద్రత పణంగా పెట్టిన విషయంలో  బాధ్యులైన నలుగురు సెక్యూరిటీ గార్డులను  విధుల నుండి తొలగించినట్లు ఈవో ప్రకటించారు.

 కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బయట తయారు చేసిన పదార్దాలు కొండ పైకి తీసుకువచ్చి పంపిణీ చేయాలని భావించినట్లు తెలుస్తోంది.
ఈ పదార్ధాల నాణ్యత లో ఏదయినా తేడా ఉన్నా భక్తుల బాధ్యత దేవస్థానం వహించవలసి ఉంటుందని, అపరిచితులను నమ్మవలసిన స్థితి లేదని పేర్కొన్నారు.

దేవస్థానం భద్రతలో ఇలాంటి లోపాలను సహించనని ఈవో స్పష్టం చేశారు. 
విధుల్లో నిర్లక్ష్యం వహించిన శ్రీ లక్ష్మయ్య, శ్రీ వెంకటేశ్వర రావు, శ్రీ కాశీ రావు అనే ముగ్గురు గార్డు లు, శ్రీ కాశయ్య అనే సెక్యూరిటీ సూపర్ వైజర్ ను విధులు నుండి తొలగించినట్లు తెలిపారు.

తాను బాధ్యతలు స్వీకరించిన కొద్ది కాలం లోనే భక్తుల భద్రత పట్ల అలక్ష్యం వహిస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీ కి పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రూ. 25,000/- ఫైన్ విధించినట్లు,నిబంధనలు అనుసరిస్తూ ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేస్తున్నట్లు ఈవో శీనానాయక్ తెలిపారు.
సరైన సేవలు అందించకపొతే ఏ సంస్థ పైన అయినా చర్యలు ఉంటాయని, మొహమాటం అస్సలు ఉండదని స్పష్టం చేశారు.

 భక్తులు దేవస్థానం నిబంధనలను పాటించాలని, అనధికార వ్యక్తుల ప్రలోభాలకు గురికావద్దని కోరారు.
అనుమతి లేకుండా ఆలయ ప్రాంగణం లో ఏ పదార్ధాల పంపిణీ కి అవకాశం లేదని భక్తుల భద్రతే ప్రధానమని శీనానాయక్ పేర్కొన్నారు.
Comments