గుంటూరు, 25 జూలై 2025 (ప్రజా అమరావతి)
:- జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించేందుకు పకడ్బందీ ప్రణాళిక ప్రకారం సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు.
:- జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించేందుకు పకడ్బందీ ప్రణాళిక ప్రకారం సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల మూల కారణాలు తెలుసుకొని పరిష్కరించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వశాఖ రూపొందించిన ఐ-ఆర్ఏడీ యాప్ లో రవాణా, పోలీస్, రహదారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రమాదాల వివరాలను, తనిఖీ నివేదికలను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. దీనిని విశ్లేషించి రహదారులపై ఉన్న బ్లాక్ స్పాట్ లను గుర్తించటంతో పాటు ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. రహదారులపై స్పీడ్ బ్రేకర్లు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం స్కూల్, హస్పిటల్ జోన్లు, బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారిపై ఖాజా టోల్ గేట్, కొలనుకొండ వద్ద వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు తూర్పునియోజకవర్గం పరిధిలోని సిగ్నల్ లైట్లు వద్ద జీబ్రా లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. మూడు వంతెనల వద్ద, కంకరగుంట ఆర్ యూ బీ వద్ద వర్షం నీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని ప్రదాన రహదారులపై వాహనల పార్కింగ్ కు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, పంచాయితీరాజ్ రహదారులపై ఉన్న 52 బ్లాక్ స్పాట్ లపై జాయింట్ కమిటీ తనిఖీలో అందించిన సూచన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి ప్రమాదాల వివరాలను ఐఆర్ఏడీ యాప్ లో సంబంధిత శాఖలు జాతీయ రహదారి సమీపంలోని ట్రామా కేర్ హాస్పిటల్స్ లో రహదారి ప్రమాదంలో గాయపడిన వారికి సత్వరమే చికిత్స అందించేలా డీఎంహెచ్ఓ ఆస్పత్రి నిర్వహకులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు.
సమావేశంలో ఐఐటీ మద్రాస్ యూనివర్సీటీ నుంచి వెబ్ ఎక్స్ ద్వారా పాల్గొన్న యూనివర్సీటీ ది సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ విభాగం ప్రోఫెసర్ సంజీవ శర్మ, ఇతర నిపుణులు ఐఆర్ఏడీ యాప్ లో నమోదు చేసిన వివరాలను డీఆర్ఎస్సీ ట్రాకర్ డాష్ బోర్డు ద్వారా పరిశీలించటానికి, పర్యవేక్షణకు, డేటా సేకరణకు రూపొందించిన ఆన్ లైన్ విధానం గురించి వివరించారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాస మూర్తి, జిల్లా ఉప రవాణ కమిషనర్ సీతారామిరెడ్డి, జాతీయ రహదారుల పీడీ పార్వతీశం, డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మీ, నగరపాలక సంస్థ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ, ట్రాఫిక్ సీఐలు అశోక్ కుమార్, సింగయ్య, నగరపాలక సంస్థ సిటి ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment