వేద విద్యార్థుల సేవలు సమాజానికి అందేలా చర్యలు - ఈవో శీనా నాయక్ .

 ఇంద్రకీలాద్రి, 31జూలై2025 (ప్రజా అమరావతి);


వేద విద్యార్థుల సేవలు సమాజానికి అందేలా చర్యలు - ఈవో శీనా నాయక్ 



శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) వి.కె. సీనా నాయక్ ఈరోజు విజయవాడలోని పోరంకిలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర వేద విద్యాలయం (వేద పాఠశాల)ను సమగ్రంగా తనిఖీ చేశారు.  సమాజహితం కోరే వేద విద్యార్థులకు అత్యుత్తమ భోధన అందించి, భవిష్యత్ తరాలకు వేదముల సారాంశాన్ని అందించడానికి శ్రీ కనకదుర్గ అమ్మ వారి దేవస్థానం కట్టుబడి ఉందని ఈవో శీనా నాయక్ అన్నారు.

గురు వారం మధ్యాహ్నం ఆకస్మికంగా దేవస్థానం వేద పాఠశాల సందర్శించి, అక్కడ పరిస్థితి గమనించారు.

విద్యార్థులకు పాఠాలు అర్థం అవుతున్నాయా, గురువులు భోధించిన పాఠాల వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టీ పరిశీలించి, సంతకం చేశారు.

విద్యార్థులను చూడటానికి వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడి, సౌకర్యాలు గురించి తెలుసుకున్నారు.

విద్యార్థులకు కావలసిన పుస్తకాలు, సౌకర్యాలు తక్షణమే ఏర్పాటు చేయవలసినదిగా సిబ్బందిని ఆదేశించారు.

Comments