కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ సారె సమర్పణ .


ఇంద్రకీలాద్రి,23 జూలై 2025 (ప్రజా అమరావతి);

అమ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ సారె సమర్పణ

నిమిత్తం ఆలయంనకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి  కళ కళ లాడింది.
ఇంటి ఆడపడుచుకు ఏ విధంగా సారె సంభారములు పెడతారో అంతకంటే శ్రద్దగా, భక్తి తో భక్త బృందాలు సామాగ్రి తో ఆషాడ మాసం  మొత్తం తరలి వచ్చారు.

రేపు అనగా జూలై 24 గురువారం చివరి రోజు ఉదయం 7 గంటలకు ఆలయ కార్యనిర్వహణా ధికారి వి కే శీనానాయక్ వారి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన మరియు ఉప ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ, వేద పండితులు, అర్చక మరియు పరిచారక స్వాములుచే చివరి రోజు ఘనంగా ఆషాఢ 
సారె సమర్పిస్తారు.

 ఆషాఢ మాసం చివరి రోజు  ఆలయ అర్చకులు సమర్పించే సారెతో ఈ సంవత్సరం సారె సమర్పణ కార్యక్రమం ముగుస్తుందని, రేపు సాయంత్రం వరకు సారె తీసుకురావచ్చునని, అనంతరం నెల రోజులు మహా మంటపంలో కొలువై పూజలందుకున్న అమ్మవారి మూర్తి ప్రధాన ఆలయం చేరుకుంటుందని అర్చకులు తెలిపారు.
Comments