*GSLV -F16 రాకెట్ ప్రయోగం విజయవంతం.*
*NISAR ఉప గ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టిన షార్*
*GSLV -F16 రాకెట్ ప్రయోగాన్ని కుటుంబ సభ్యులతో వీక్షించిన జిల్లా కలెక్టర్*
శ్రీహరికోట, తిరుపతి జిల్లా తేదీ 30. జూలై (ప్రజా అమరావతి);
ఇస్రో భారత అంతరిక్షంలో మరో మైలురాయిని చేరుకుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి చేసిన 102 వ ప్రయోగం విజయవంతం అయ్యింది. సాయంత్రం 5.40 నిమిషాలకు GSLV - F16 రాకెట్ NISAR ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. GSLV - F16 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ డా. వి నారాయణన్ అభినందించారు.
ఈ ఉపగ్రహం వాతావరణ పరిస్థితులతో పాటు, సముద్రాల లోతు,మార్పులతో పాటు రక్షణ రంగాలకు కీలకంగా మారనుంది.
ఈ రాకెట్ ప్రయోగాన్ని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శాస్త్రవేత్తల బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తిని ప్రపంచపటంలో ఉన్నత స్థానంలో నిలిపిన శాస్త్రవేత్తల సేవలను జిల్లా కలెక్టర్ కొనియాడారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్ షి, ఆర్ డి ఓ కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment