కొత్త అంబులెన్సు బహుకరణ.



ఇంద్రకీలాద్రి, 02 సెప్టెంబర్ 2025 (ప్రజా అమరావతి);


కొత్త అంబులెన్సు బహుకరణ 


ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఆరోగ్యఅత్యవసర పరిస్థితి ఏర్పడితే ఆసుపత్రికి తీసుకెళ్లే నిమిత్తం ఆధునిక సదుపాయాలు గల కొత్త అంబులెన్సును ఈరోజు ఉదయం - GRT జ్యువలర్స్, విజయవాడ వారు దేవస్థానంకి అందించారు.


ఈరోజు ఉదయం 10 గంటలకు ఆలయ కార్యనిర్వాహణాధికారి వి. కె  శీనా నాయక్ నూతన అంబులెన్సు కు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. GRT జ్యువలరీ ప్రతినిధులు అంబులెన్సు పత్రాలు, తాళాలు ఈవో కు అందజేశారు.


ఇప్పటి వరకు దేవస్థానంనకు ఓకే అంబులెన్సు ఉండటం, అది కూడా మహా మండపం వైపు కొండ దిగువున ఉండటంతో కొండ పైన భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే క్రింద నుండి అంబులెన్సు రావలసిఉండటంతో ఇటీవల దేవస్థానం సిబ్బంది GRT జ్యువలరీ వారిని విరాళం అడిగినట్లు శీనా నాయక్ తెలిపారు.


 ఈ అంబులెన్సు కొండపైన సమాచారకేంద్రం వద్ద ఉంటుందని, భక్తుల కోసం ఇంకో అధునాతన అంబులెన్సు అవసరం ఉందని దాతలు ఎవరైనా అమ్మవారికి సమర్పించవచ్చని ఈవో తెలిపారు. భక్తుల సేవలో తరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.


ఈ కార్యక్రమంలో GRT జ్యువలరీ, విజయవాడ ప్రతినిధులు, వరుణ్ మోటార్స్ ప్రతినిధులు, దేవస్థానం ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments