విజయవాడ (ప్రజా అమరావతి);
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్. సవిత మంగళవారం శ్రీ గాయత్రీ దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాకారానికి గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని.. భక్తులు సంతృప్తికరంగా అమ్మ దర్శనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేస్తూ సామాన్య భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు తెలిపారు కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ విషయం పైనా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. డ్రోన్ సాంకేతికతను కూడా క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి స్త్రీ శక్తి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని.. ఆయన కృషి ఫలించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు.
addComments
Post a Comment