తెనాలి నియోజకవర్గం వైయెస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి నూతన ఉత్తేజం.
  తెనాలి నియోజకవర్గం వైయెస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి నూతన ఉత్తేజం.

     
  కొల్లిపర (ప్రజా అమరావతి);
     

           తాడేపల్లి సెంట్రల్ ఆఫీసులో తెనాలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు  అన్నాబత్తుని శివకుమార్  ఆధ్వర్యంలో రాష్ట్ర వైయెస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  జగన్మోహన్ రెడ్డి ని తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం మున్నంగి వాస్తవ్యులు & మాజీ కొల్లిపర మండలం ఎంపిపి  ఆరిగ అశోక్ రెడ్డి  మరియు వారి శ్రీమతి ఆరిగ మాధవి రెడ్డి మర్యాదపూర్వకముగా కలుసుకున్న విషయం అందరికి తెలిసినదే. 
ఈరోజు కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో మండల స్థాయి ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, నియోజకవర్గ సమన్వయకర్త  అన్నాబత్తుని శివకుమార్ ని ఆ సమావేశానికి ఆహ్వానించిన కొల్లిపర మాజీ ఎంపిపి ఆరిగ అశోక్ రెడ్డి  మరియు వారి తండ్రి   అరిగ కోటిరెడ్డి  తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునః వైభవానికి అలాగే వచ్చే ఎన్నికల్లో మాజీ శాసనసభ్యులు  అన్నాబత్తుని శివకుమార్  గెలుపుకు తాము తమ సైన్యం విశేష కృషి చేస్తామని మాట ఇచ్చారు.

Comments