*9మంది మున్సిపల్ నూతన ఉద్యోగులకు... నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే రాము*
*ప్రజలకు మంచి చేయడమే మనందరి లక్ష్యం కావాలి...*
*వైకాపా దళారుల మోసానికి...నష్టపోయిన ఐదు కుటుంబాలకు నేడు కారుణ్య నియమకాల కింద ఉద్యోగాలిచ్చాం...*
గుడివాడ సెప్టెంబర్ 01 (ప్రజా అమరావతి): ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు నిజాయితీ, నిస్వార్థంతో ప్రజలకు సేవలు అందించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.
గుడివాడ పురపాలక సంఘంలో నలుగురు ఉద్యోగులకు కారుణ్య నియామక పత్రాలు... ఐదుగురు ఔట్సోర్సింగ్ సిబ్బందికి నియామక పత్రాలను ఎమ్మెల్యే రాము పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. నేడు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులు మరియు సిబ్బంది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. నూతనంగా ఉద్యోగంలో చేరిన వారు అధికారులు సూచనలు పాటిస్తూ, సీనియర్ల సలహాలతో శాఖా పరమైన పట్టు సాధించాలన్నారు. ప్రధానంగా గత వైకాపాలనలో కరోనా సమయంలో మరణించిన సానిటేషన్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా వాటిని అప్పటి నాయకులు అమ్ముకున్నారన్నారు. వైకాపా మోసానికి నష్టపోయిన ఐదు కుటుంబాలకు చెందినవారికి నేడు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు.
ఉద్యోగుల సమస్యలపై తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని, ప్రభుత్వ సేవలు ప్రజలు స్పందించడం, వారికి మంచి చేయడమే మనందరి లక్ష్యం కావాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, టిడిపి నాయకుడు నిమ్మగడ్డ సత్యసాయి, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment