అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు... దర్శన ఏర్పాట్లపై కలెక్టర్ కు ప్రశంసలు.

 *అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు... దర్శన ఏర్పాట్లపై కలెక్టర్ కు ప్రశంసలు*



 విజయవాడ (ప్రజా అమరావతి);


దసరా  శరన్నవరాత్రుల్లో రెండవ రోజు మంగళవారం శ్రీ గాయత్రి మాతను తెలంగాణ రాష్ట్ర మెదక్ లోక్ సభ సభ్యులు రఘునందన్ రావు దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలుపుతున్నట్లు  చెప్పారు. వస్తు, సేవల పన్ను( జీఎస్టీ ) రేటును తగ్గించడం వల్ల పండుగ ఆనందం రెట్టింపు అయిందన్నారు.

 జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జీఎస్టీ కోసం ప్రధాని నరేంద్ర మోదీ విశేష కృషి చేశారని, అమ్మవారి ఆశీస్సుల తో ప్రధాని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో  జీవించాలని ఆకాంక్షించారు.


Comments