దసరా ఉత్సవాలకు అన్ని విధాలా అధికారులు సన్నద్ధం అయి, భక్తుల సౌకర్యాల విషయం లో ఏకాభిప్రాయం కలిగి ఉండాలి.


ఇంద్రకీలాద్రి, 15 సెప్టెంబర్ 2025 (ప్రజా అమరావతి);


ప్రతిష్టాత్మకంగా జరుగబోయే ఇంద్రకీలాద్రి శ్రీ కనక దుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలకు అన్ని విధాలా అధికారులు సన్నద్ధం అయి, భక్తుల సౌకర్యాల విషయం లో ఏకాభిప్రాయం కలిగి ఉండాల


ని దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ అన్నారు.

                                                                                                                                                                 దసరా శరన్నవరాత్రుల ఏర్పాట్లను  ఈరోజు ఉదయం పరిశీలించారు. 


ఈవో  శీనా నాయక్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలన చేశారు. 

కనకదుర్గా నగర్, కొత్త లడ్డు పోటు, అన్నదానం భవనం తదితరములు కార్యనిర్వాహక ఇంజనీర్-1 కేవీఎస్ఆర్ కోటేశ్వర రావు, కార్యనిర్వాహక ఇంజనీర్-2  రాంబాబు, అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పెనుగంచిప్రోలు దేవస్థానం ఈఈ ఎల్. రమ, ద్వారకా తిరుమల దేవస్థానం  డి.వి. భాస్కర్  లతో పరిశీలించి, పలు ఆదేశాలు జారీ చేశారు.


ఈ సందర్బంగా కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ  దేవస్థానం ఆవరణలో జరుగుతున్న పనుల్లో 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను అదనపు కార్యనిర్వాహక ఇంజనీర్ల సహకారంతో 48 గంటల్లోగా పూర్తి చేసి, ఫిట్నెస్ సర్టిఫికెట్లను సమర్పించాలని అధికారులను ఆదేశింఛానని పేర్కొన్నారు.

                                                                                                                                                                                                    

                                                                                                                                                                                            కొండపైన, కొండ కింద దేవస్థానం ప్రాంగణాలను, అలాగే కనకదుర్గ నగర్, మహా మండపము ప్రాంతాలను విస్తృతంగా కమీషనర్ పరిశీలన చేశారు.

 

 నిర్దేశించిన సమయంలోగా మిగిలిన పనులను పూర్తి చేయాలని రామచంద్ర మోహన్ అధికారులకు సూచించారు. 


 రాబోయే దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా రద్దీ నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.


 దసరా ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా, భక్తులకు సంతృప్తికరంగా జరిగేలా చూడాలని, ఏర్పాట్లు లో రాజీ పడవద్దని, భక్తుల సంతృప్తి ప్రధానంగా ముందుకు సాగాలని కమిషనర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Comments