తిరుమల, 2025 సెప్టెంబర్ 15 (ప్రజా అమరావతి);
రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ కు తిరుమలలోని విధాత నిలయం (రచన) విశ్రాంతి గృహాం వద్ద టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గవర్నర్ కు పోలీసులు గౌరవ వందనం అందించారు.
కాగా రేపు ఉదయం రాష్ట్ర గవర్నర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ (దేవాదాయ శాఖ) డా. హరి జవహర్ లాల్, టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment