భక్తులతో కలసి సాగిన జిల్లా పాలనాధికారి.

 *దుర్గఅమ్మవారి దర్శన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్... సాధారణ భక్తుడిగా క్యూలైన్లో దర్శనం*

   *. భక్తులతో కలసి సాగిన  జిల్లా పాలనాధికారి


*

    .*  క్యూలైన్ల నిశిత పరిశీలన*

       *బస్టాండు, సీతమ్మ వారి పాదాల       సందర్శన*

   *. భక్తుల అభిప్రాయాలు             తెలుసుకున్న లక్ష్మీశ*


 విజయవాడ (ప్రజా అమరావతి);


       భక్తులకు కల్పిస్తున్న దర్శన  ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం పరిశీలించారు. . క్యూలైన్లో  వెళ్లి దర్శనాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండ అన్ని జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులతో కలిసి అమ్మవారి అన్న ప్రసాదం  స్వీకరించారు.


పండిట్ నెహ్రూ బస్టాండును సందర్శించి ప్రయాణికులతో మాట్లాడారు. సీతమ్మ వారి పాదాల వద్ద భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.


Comments