అనంతపురం (ప్రజాఅమరావతి); జర్నలిస్టులు ఐకమత్యంగా ముందుకు కదలాలి.మచ్చా రామలింగా రెడ్డి ని రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా సన్మానించిన తాడిపత్రి జర్నలిస్టులు.జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన మచ్చా రామలింగారెడ్డి ని తాడిపత్రి జర్నలిస్ట్ మిత్రబృందం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అనంతపురం నగరంలోని R&B అతిథి గృహం నందు నగర జర్నలిస్టులు శాలువలు బుకే లతో సన్మానించారు అలాగే ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్ ని కూడా జర్నలిస్టులు సన్మానించారు. అదేవిధంగా జర్నలిస్టులందరు జ్ఞాపికగా మొక్కలను గిప్ట్ గా ఇవ్వడం జరిగింది మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం పై రాజీలేని పోరాటం చేస్తామని జర్నలిస్టులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ కమిటీలను ఏర్పాటు చేస్తామని యూనియన్లకు అతీతంగా సొసైటీ పనిచేస్తుంది అని మచ్చా రామలింగారెడ్డి తెరిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ కి అండగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతామని అన్ని జిల్లాల్లో త్వరలో పర్యటిస్తానని ఆయా ప్రాంతాల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు కావడం జర్నలిస్టులందరికీ గర్వకారణమని జిల్లాలోని జర్నలిస్టులందరికీ స్ఫూర్తి ఇస్తుందని జర్నలిస్టు మాట్లాడుతూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో CB మధు కన్నా, నాగరాజు విజయ్ కుమార్, నరేంద్ర , బబ్లూ, సంజీవ , ఇర్ఫాన్ ప్రకాష్, మల్లి , మల్లికార్జున, అమర్ నాథ్, సిద్ధ , బాలాజీ, బాషా పాల్గొన్నారు.


Comments