*నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఇస్లాం పేట గ్రామంలో పర్యటించి, సుమారు ₹కోటి రూపాయలతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.* *బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.* *టాటా ట్రస్ట్ ద్వారా చిన్న పిల్లలకు విటమిన్స్ మరియు ప్రొటీన్స్ తో కూడిన "గోమో" ప్యాకెట్లు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి. ప్రతి గ్రామంలో ప్రజలు కోరుకున్న విధంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గ్రామాల్లో తాగు, సాగు నీరుతో పాటు రోడ్లు, డ్రైన్ల నిర్మాణం పనులు చేపడుతున్నాం. 150 ముస్లిం, మైనారిటీ కుటుంబాలు నివసించే ఇస్లాం పేట గ్రామానికి కోటి రూపాయల నిధులను మంజూరు చేయించి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్ని సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. ముస్లిం మైనార్టీలను అన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయి. మైనారిటీల సంక్షేమం గురించి ఆలోచన చేసి రిజర్వేషన్లు కల్పించిన ఘనత మహానేత రాజశేఖర్ రెడ్డి గారిది. ప్రస్తుతం ముస్లిం మైనారిటీ లకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిస్తున్నారు. రెండు రోజుల అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల మనోభావాలను గౌరవించి, వారు కోరిన విధంగా NPR కు వ్యతిరేకంగా తీర్మానం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. సంక్షేమ పథకాల విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందించడం జరుగుతుంది. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారిస్తాను. రెండు సార్లు శాసనసభ్యునిగా అవకాశమిచ్చి, ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యాక్రమాలు చేపట్టే అవకాశం కల్పించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు నా ధన్యవాదాలు.


Comments