అమరావతి (ప్రజాఅమరావతి);జాన్,18: పొగాకు రైతుల ఇబ్బందులపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష క్యాంపు కార్యాలయంలో సమావేశం రైతులను ఆదుకునేందుకు కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి రైతుల్ని ఆదుకునేందుకు మార్కెట్లో జోక్యం చేసుకోనున్న ప్రభుత్వం ఏపీ మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోళ్లు దీని కోసం 2–3 రోజుల్లో ప్రత్యేక సంస్థ ఏర్పాటు ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో పని చేయనున్న సంస్థ పొగాకుకు కనీస ధరలు ప్రకటించనున్న ప్రభుత్వం ఆ రేట్ల జాబితాను కొనుగోలు కేంద్రాల్లో ప్రదర్శించనున్న ప్రభుత్వం అంత కన్నా పైధరకే వేలం పాటలు పొగాకు కొనుగోలు ప్రక్రియలో పాల్గొనని వ్యాపారులు, కంపెనీలపై వేటు లైసెన్స్‌ ఉన్న వ్యాపారులు, కంపెనీలకు నియమాలు వేలంలో తప్పనిసరిగా పాల్గొనాలి వేలం జరిగే అన్ని రోజుల్లో కూడా కొనుగోళ్లలో పాల్గొనాలి నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోళ్లు జరపాలి, లేకపోతే వారి లైసెన్స్‌లు రద్దు అమరావతి: – పొగాకు కొనుగోళ్లపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష, క్యాంపు కార్యాలయంలో సమావేశం – మంత్రులు కె.కన్నబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీ బాలశౌరి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి, పొగాకు బోర్డు ఛైర్మన్‌ రఘునాథబాబు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.సునీత, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్, మార్క్‌ఫెడ్‌ ఎండీ ప్రద్యుమ్న తదితరులు హాజరు. – సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు, రైతులు, రైతు ప్రతినిధులు పరిస్థితులను సీఎంకు వివరించిన రైతులు: – రైతులనుంచి అభిప్రాయాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి – పొగాకు కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించిన రైతులు. – ఇండెంట్‌ ఇచ్చి, మా చేత పంట పండించి చివరకు వేలం కేంద్రం వద్దకు రావడం లేదు. – కరోనాకు ముందు ధరలు బాగున్నా, ఇప్పుడు కరోనా తర్వాత ధరలు తగ్గిపోయాయి. – మా దగ్గర పొగాకును కొనుగోలు చేయడం లేదు. వారం రోజులు, పది రోజులు అని చెప్తున్నారు కాని, గడువు ముగిసినా.. కొనుగోలు చేయడం లేదు. వేలం కేంద్రాల వైపు వ్యాపారులు చూడడం లేదు. – కేంద్ర ప్రభుత్వానికి రూ.40 వేల కోట్లు, ఎగుమతుల రూపంలో మరో రూ.6 వేల కోట్ల రూపాయల ఆదాయం పొగాకు ద్వారా వస్తోంది. రైతులకు మాత్రం అప్పుల బాధ తప్పడం లేదు. – ఒక ఏడాది పెట్టబడులు వస్తే.. వరుసగా ఆరు సంవత్సరాలు నష్టాలు వస్తున్నాయి. – ఆర్డర్స్‌ ఉన్నా.. సరే.. కొనుగోలు చేయడం లేదు. ఎకరాకు రూ.1.4 లక్షలు ఖర్చు చేస్తున్నాం. – పొగాకు కొనుగోలు కోసం రిజిస్టర్‌ చేసిన కంపెనీలు కూడా వేలంలో పాల్గొనడం లేదు. – మీడియం, లోగ్రేడ్‌ పొగాకు రేటు పెంచాలి. సీఎం వ్యాఖ్యలు: – చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుంది, మార్కెట్లో కాంపిటీషన్‌ పెంచింది: – రైతులకు మేలు చేసే ప్రభుత్వం ఇక్కడ ఉంది, దీన్ని మీరు సానుకూలంగా తీసుకోవాలి – ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ముందుకు రావాల్సి ఉంది. – మీరు ఇచ్చిన లక్ష్యాల మేరకే సాగవుతున్నప్పుడు కొనుగోలు చేయకోతే రైతులు నష్టపోతారు. – 920 మందికి లైసెన్స్‌లు ఇచ్చినా.. 15 మందికి మించి పొగాకు వేలం పాటల్లో పాల్గొనడం లేదు. – వ్యాపారులు కుమ్మక్కు అవుతున్నారని రైతులు అంటున్నారు. – రైతులు వేలం కేంద్రానికి తీసుకు వచ్చినప్పుడు కేవలం నాణ్యమైన పొగాకును మాత్రమే తీసుకుని మిగతాది కొనుగోలు చేయకుండా వదిలేస్తున్నారని రైతులు చెప్తున్నారు. – వ్యాపారులు ఒక రింగులా ఏర్పడుతున్నారని రైతులు చెప్తున్నారు. – ఈ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాల్సి ఉంది. – మార్కెట్లో పారదర్శకత, ఫెయిర్‌ విధానాలు, పోటీని పెంచే విధానాలు ఉండాలి. – రైతుల సరుకును నిరాకరించడం వల్ల వారిలో భయాందోళనలు నెలకొంటున్నాయి. చివరకు వారు ఎంతో కొంతకు తెగనమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి. – వేలం కేంద్రానికి సరుకు వచ్చిన రోజే కొనుగోలు చేస్తేనే బాగుంటుంది. – రైతుల నుంచి ఎంత కొనుగోలు చేస్తామన్నది ముందే మీరు పరిమితి విధిస్తున్నప్పుడు.. కొనుగోలు చేయకపోవడం కరెక్టు కాదు. తిప్పి పంపే పరిస్థితి ఉండకూడదు. – కేవలం మేలు రకం కొనుగోలు చేయడం వల్ల రైతులను తీవ్ర నిరాశలోకి నెట్టినట్టు అవుతుంది. – ప్రాసస్‌ చేసే అవకాశం రైతుకు లేదు కాబట్టి.. రైతు ఎంతకాలం సరుకును నిల్వ చేసుకోలేడు. చివరకు రింగ్‌ ఏర్పడ్డానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. – ఈ ఏడాది ధరల స్థిరీకరణ కోసం రూ.3200 కోట్లు ఖర్చు చేశాం అరటి, మొక్కజొన్న, పసుపు, శనగ ఇలా అన్ని రకాల పంటలను కొనుగోలు చేశాం – కరోనా సమయంలో భారీగా ఖర్చు చేసి కొనుగోలు చేశాం – పొగాకును కూడా కొనుగోలు చేస్తాం. మార్కెట్‌కు ఏం వచ్చినా సరే కొనుగోలు చేయాలి. – అన్ని రకాల పొగాకును కనీస ధరలు ప్రకటించి కొనుగోలు చేయాలి – ఈ రేట్లను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శించాలి. ఈ రేట్లను ప్రామాణికంగా తీసుకుని «వేలం నిర్వహించాలి. ప్రకటించిన కనీస రేట్లకుపైనే వేలం కొనసాగాలి. తద్వారా రైతుల్లో విశ్వాసం, భరోసా కల్పించాలి. – పొగాకు బోర్డు, కంపెనీలు కలిసి రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకోండి. – లైసెన్స్‌లు తీసుకుని, వేలంలో పాల్గొనని వ్యాపారులు, కంపెనీల విషయంలో పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలి. – పొగాకు కొనుగోలు వ్యవహారాన్ని రింగ్‌ చేసే పద్దతులకు స్వస్తి చెప్పాలి – వ్యాపారాలు చేయని వారి లైసెన్స్‌లను తొలగించాలి. వ్యాపారాలు చేయకపోతే వారికి లైసెన్స్‌లు ఎందుకు? – ఇవి చేయగలిగితే చాలా వరకు పరిస్థితి అదుపులోకి వస్తుంది. – రాష్ట్ర ప్రభుత్వం పొగాకు మార్కెట్లో జోక్యం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఆ సంస్థ పొగాకు కొనుగోలు కోసం లైసెన్స్‌ తీసుకుంటుంది. ఒక ఐఏఎస్‌ స్థాయి అధికారి నేతృత్వంలో ఆ సంస్థ నడుస్తుంది. – బోర్డు.. పొగాకు కొనుగోలు కంపెనీలు, వ్యాపారుల సహకారంతో ముందుకు వెళ్తుంది. – ప్రకటించిన కనీస ధరల కన్నా.. ఎక్కువ ధరకు కొనుగోలు చేసేలా చూస్తుంది. – పొగాకు గ్రేడ్ల వారీగా రెండు రోజుల్లో కనీస ధరలు ప్రకటించాలి. – అలాగే లైసెన్స్‌ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పొగాకును కొనుగోలు చేయాలి. – వేలం కేంద్రాల వద్ద ప్రతిరోజూ కొనుగోలు చేయాలి, వేలం జరిగే అన్ని రోజులూ పాల్గొనాలి. – నిర్దేశించిన లక్ష్యాల మేరకు పొగాకును వారు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. – రైతుల నుంచి ఉత్పత్తుల కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఆదాయం తెచ్చుకోవాలనే లక్ష్యంతో కాకుండా, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇది మాఅజెండా.


Comments