*20.6.2020* *తాడేపల్లి* *క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం రెండో విడత కార్యక్రమంను ప్రారంభించిన సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన లబ్ధిదారులు* *బాలం లక్ష్మి, రాప్తాడ్ నియోజకవర్గం, సిండికేట్ నగర్ గ్రామం, అనంతపురం జిల్లా:* *చేనేత కార్మికులకు నేనున్నానని ధైర్యం ఇచ్చారు...* గత పదిహేను సంవత్సరాలుగా మగ్గం నేస్తున్నాము. గతంలో అనేక ఇబ్బందులు పడ్డాం... చాలా మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ధర్మవరంలో చేనేత కార్మికుల దీక్ష సందర్బంగా నేనున్నానని ఆనాడు మాకు ధైర్యాన్ని ఇచ్చారు. అధికారంలోకి వస్తే మగ్గం వున్న ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. సీఎంగా మీ పుట్టినరోజు సందర్బంగా గత డిసెంబర్ 21వ తేదీన మాకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా రూ.24వేలు మా బ్యాంకు ఖాతాకు జమ చేశారు. ఆరోజు మా సంతోషానికి అవధులు లేవు. మీరు ఇచ్చిన ధైర్యంతో ముందుకు సాగుతున్నాం. మొదట్లో మేం గద్వాల్ చీరెలు నేసేవారం, ఇప్పుడు పెద్ద చీరెలు నేస్తున్నాం. గతంలో నెలకు రూ.8వేలు సంపాధిస్తే... ఇప్పుడు నెలకు రూ.15వేలు సంపాధిస్తున్నాం. రాబోయే ముప్పై సంవత్సరాలు మీరే సీఎంగా వుండాలన్నా. *వాసా సత్యవతి, వంగర గ్రామం, తూర్పు గోదావరిజిల్లా:* *చేనేత కుటుంబాల్లో వెలుగు నింపిన దేవుడు మీరు* వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ.24వేలు అందించడం ద్వారా చేనేత కుటుంబాల్లో వెలుగు నింపిన దేవుడు మీరు. మీరు అందించిన సాయంతో మగ్గాలకు కావాల్సిన సామాన్లను కొనుక్కొని, మా ఆదాయన్ని పెంచుకున్నాం. కరోనా కష్టకాలంలో మా ఇబ్బందులను గమనించి ఆరు నెలలు ముందుగానే రెండో విడత నేతన్న నేస్తం కింద మీరు రూ.24 వేలు ఇవ్వడం మాకు ఎంతో భరోసాను కల్పించింది. గతంలో చేనేత వృత్తి ఎంతో గొప్పగా వుండేది... కానీ ఏ ప్రభుత్వాలు మా కష్టాలను పట్టించుకోక పోవడంతో మేం ఇబ్బందుల్లో పడిపోయాం. మీరు నేతన్న నేస్తం ద్వారా మాకు అండగా నిలిచారు. ఎప్పటికీ మీరే సీఎంగా వుండాలని కోరుకుంటున్నాను. *కె. మల్లిబాబు, రాజుల గ్రామం, శ్రీకాకుళం జిల్లా:* *చేనేత కార్మికులు మీకు రుణపడి వుంటారు, మీరే కలకాలం సీఎంగా వుండాలి* గతంలో ముతక రకాలు నేసే వాళ్ళం...ఇప్పుడు డిజైన్ చీరెలు నేస్తున్నాం గతంలో మాకు చాలీచాలని బతుకు దెరువుగా చేనేత వుండేది. మా స్తోమతను బట్టి ముతక రకాలను నేసే వాళ్లం. దానివల్ల మాకు ఆదాయం కూడా తక్కువగానే వచ్చేది. ఇప్పుడు మీరు నేతన్న నేస్తం ద్వారా అందిస్తున్న రూ.24 వేలు సాయంతో సామన్లు కొనుగోలు చేసి డిజైన్ చీరెలు నేస్తున్నాం. గతం కంటే మా ఆదాయం కూడా పెరిగింది. కరోనా సమయంలో మాకు ఆరునెలల ముందుగానే రెండో విడత సాయంను అందించినందుకు చేనేత కార్మికులు మీకు రుణపడి వుంటారు. మీరే కలకాలం సీఎంగా వుండాలి. *సరోజమ్మ, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా:* *మా చేనేత గుండె చప్పుడు మీకు వినపడింది* ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు వచ్చారు... చేనేత కార్మికులను ఆదుకుంటామని అన్నారు... ఎవ్వరూ ఏమీ చేయలేదు... కానీ మీకు మాత్రం మా గుండె చప్పుడు వినపడింది. నేనున్నానని మీరు మాకు అండగా నిలిచారు. వైఎస్ఆర్ నేతన్ననేస్తం కింద తొలి విడత రూ.24వేలు మాకు అందింది. గతంలో లుంగీలు, టవల్స్ మాత్రమే నేసి నెలకు నాలుగు వేల వరకు ఆదాయాన్ని అందుకునే వాళ్లం. ఇప్పుడు మీరు అందించిన సాయంతో గద్వాల్ సిల్క్ చీరెలు నేస్తున్నాను. నెలకు పదిహేను వేల రూపాయల వరకు ఆదాయం లభిస్తోంది. మాకు అవకాశం వచ్చినప్పుడు మీ రుణం తీర్చుకుంటామన్నా.. *కోటేశ్వరి, మంగళగిరి, గుంటూరుజిల్లా:* *మా గోడు ఆలకించిన మొదటి నేత మీరే* ఇంతకు ముందు మా గోడు ఎవరూ ఆలకించలేదు... ముప్పై ఏళ్ళ నుంచి నేను చేనేత వృత్తిలో వున్నాను. ఇంతకు ముందు మా గోడు ఎవరూ ఆలకించలేదు. మీరు వచ్చి వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద రూ.24 వేలు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. *శ్యామలరావు, పోలవరం గ్రామం. గూడురు మండలం, కృష్ణాజిల్లా:* *చేనేత కార్మికుడికి ప్రభుత్వం నుంచి నేరుగా ఇంత మొత్తం ఎప్పుడూ అందలేదు* *బడుగు బలహీనవర్గాలకు మీరు అభినవ పూలే.* ఇప్పటి వరకు చేనేత కార్మికుడికి నేరుగా ప్రభుత్వం నుంచి ఇంత మొత్తం ఎప్పుడూ అందలేదు. మీలాగా చేనేతను ఆదుకున్న వారు దేశంలో ఎవరూ లేరు. మీరు మళ్ళీ...మళ్ళీ సీఎంగా వుండాలి. మీరు ఏడాదికి నేతన్న నేస్తం కింద అందిస్తున్న రూ. 24 వేలతో కొత్త చేనేత పరికాలను కొనుగోలు చేశాం. బుట్టా రకాలు, జాబాక్ మిషన్ల మీద కొత్త డిజైన్లను నేస్తున్నాం. దీనివల్ల మా ఆదాయం పెరిగింది. ఎనిమిది నుంచి పన్నెండు వేల వరకు ఆదాయం పొందుతున్నాం. బడుగు బలహీనవర్గాలకు మీరు అభినవ పూలే. *లక్ష్మీనారాయణ, ఈతముక్కల గ్రామం.ప్రకాశం జిల్లా:* *చేనేతను వదిలేసిన వారు మళ్లీ వృత్తిలోకి వస్తున్నారు.* ఒకప్పుడు వ్యవసాయం తరువాత చేనేత ప్రధాన రంగంగా వుండేది. కానీ ఆదకునే వారు లేక, చేనేత వృత్తిలో వుండి, ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చాలా మంది ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. నేడు నేత కార్మికులు మీరు అందిస్తున్న భరోసాతో వారు తిరిగి మగ్గాలను ఏర్పాటు చేసుకుని, ఈ వృత్తిలోకి వస్తున్నారు. మా గ్రామంలోనే డెబ్బై, ఎనబై మగ్గాలు కొత్తగా వచ్చాయి. కరోనా వల్ల వస్త్రాల ఎగుమతులు ఆగిపోయాయి. కొనుగోలు చేసే వారు లేక, మాకు ఆదాయం లేకుండా పోయింది. ఈ సమయంలో ఆరు నెలల ముందే మీరు అందిస్తున్న రెండో విడత నేతన్ననేస్తం సొమ్ము మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో మా గ్రామంలో కేవలం లుంగీలు మాత్రమే నేసే వాళ్ళం... ఇప్పుడు మీరు అందిస్తున్న సాయంతో పట్టుచీరెలు, జరీచీరెలు నేస్తున్నాం. మా ఆదాయం పెరిగింది.


Comments