వైయస్సార్‌ ఉచిత పంటల బీమా 2018–19లో అప్పటి ప్రభుత్వం బకాయి పడిన రూ.122.61 కోట్ల ప్రీమియమ్‌ చెల్లించిన ప్రభుత్వం. అప్పటి పంట నష్టానికి సంబంధించి రూ.596.36 కోట్ల క్లెయిమ్స్‌ విడుదల. ఆ మొత్తంతో 5,94,005 మంది రైతులకు లబ్ధి. క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా ఆ నగదు జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. * పంటల బీమా ప్రీమియం చెల్లింపుల్లో రాష్ట్రప్రభుత్వం సమూల మార్పులు చేసింది. * రైతులపై ఏ మాత్రం భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లిసుంది. * రైతుల నుంచి నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేస్తారు. పంటల ఈ–క్రాపింగ్‌ పూర్తి కాగానే ప్రీమియం చెల్లింపులు చేసున్నారు. * రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటల ఈ–క్రాపింగ్‌ చేస్తున్నారు. * గ్రామ సచివాలయాల్లో సర్వేయర్, రెవెన్యూ, వ్యవసాయ సహాయకుల సంయుక్త పర్యవేక్షణ పూర్తి కాగానే, ఈ–క్రాపింగ్‌ నమోదు చేస్తున్నారు. ఆ వెంటనే పంటల ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది.


Comments