పరీక్షలు నిర్వహణపై సూచనలివ్వండి. అకడమిక్ కాలెండర్ పై సమీక్ష. మంగళగిరి (ప్రజాఅమరావతి) జూన్ ,23 : యు జీ, పి జీ పరీక్షలు నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సూచనలు ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కోవిడ్ కారణంగా ఇప్పటికే పదవ తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు అయిన నేపథ్యంలో ఈ అంశంపై మంగళగిరి లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. యు జీ, పి. జీ పరీక్షల నిర్వహణ, అకడమిక్ కాలెండర్ తదితర అంశాలపై సమీక్షించారు. అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. వెల్లడించిన అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని వాటిని ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో సి ఎం అడిషనల్ చీఫ్ సెక్రటరీ పి వి రమేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, కళాశాలవిద్య కమిషనర్ ఎం. ఎం నాయక్, తదితరులు పాల్గొన్నారు.


Comments